Rashmika Mandanna మాజీ ప్రియుడిని వెనక్కి నెట్టిన రష్మిక మందన్న... కన్నడలో టాప్ హీరో హీరోయిన్లు ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సినీ తారాలపై సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కన్నడంలో టాప్ హీరోలు, హీరోయిన్లు ఎవరు అనే దానిపై ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా సర్వే నిర్వహించింది. ఇక కన్నడంలో టాప్ 5 హీరోలు, టాప్ 5 హీరోయిన్ల లిస్టును రిలీజ్ చేసింది ఆర్మాక్స్. ఇక ఈ తాజా లిస్టులో హీరోయిన్లలో రష్మిక మందన్నా టాప్ 1లో నిలిచింది. ఇక ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి మాత్రం టాప్ 3లో నిలిచాడు. ఇక కన్నడంలో సినిమాలు చేయకపోయినా.. ఈ భామ టాప్ లో ఉండటం గమనార్హం. ఇక కన్నడంలో టాప్ హీరోయిన్లు, హీరోలు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నంబర్ 1 హీరో, నంబర్ 1 హీరోయిన్ ఎవరు అంటే.. సహజంగా తమకు నచ్చిన వారినే చెప్పుకుంటారు ఫ్యాన్స్. అయితే సినీ తారాలపై ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా సర్వే నిర్వహిస్తూ.. ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆర్మాక్స్ మీడియా లిస్టును విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా కన్నడంలో టాప్ 5 హీరోయిన్లు, టాప్ 5 హీరోల జాబితాను రిలీజ్ చేసింది ఆర్మాక్స్. ఈ లిస్టును తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నెటిజన్స్ తో పంచుకుంది.

ఇక ఆ లిస్టులో టాప్ 1 హీరోయిన్ గా రష్మిక మందన్నా నిలించింది. ఈ భామ కన్నడంలో సినిమాలు చేయకపోయినా టాప్ 1లో నిలిచింది. దానికి కారణం ఆమెకు నేషనల్ వైడ్ గా ఉన్న క్రేజ్. ఇటీవల యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ భామ.. బాలీవుడ్ లో కూడా తన సత్తా ఏమిటో చూపిస్తోంది. ఇక ఈ భామ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ సినిమాలతో దూసుకుపోతుుంది ఈ బ్యూటీ.
ఇక ఆ తర్వాతి స్థానంలో టాప్ 2 హీరోయిన్ గా రచితా రామ్, టాప్ 3 హీరోయిన్ గా రాధిక పండిట్ నిలిచారు. రాధిక పండిట్.. కన్నడ రాక్ స్టార్ యష్ భార్య అనే సంగతి తెలిసిందే. ఈ భామ కూడా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఆర్మాక్స్ రిలీజ్ చేసిన లిస్టులో ఈ బ్యూటీ టాప్ 3లో నిలిచింది. ఇక టాప్ 4లో రమ్య నిలవగా.. టాప్ 5లో శ్రీనిధి శెట్టి నిలిచింది. కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో ఈ భామకు మంచి పేరు లభించింది.
ఇక టాప్ 5 హీరోస్ లిస్టుకు వచ్చేసరికి టాప్ 1లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నిలిచాడు. ఈ హీరో కేజీఎఫ్ సిరీస్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ కొట్టేశాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇటీవల తన సినిమాను అనౌన్స్ చేశాడు. టాక్సిక్ అంటూ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. మరి ఈ చిత్రంతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఇక టాప్ 2లో కిచ్చ సుదీప్ నిలిచాడు.
ఇక టాప్ 3లో రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి నిలిచాడు. ఈ హీరో ఇటీవల సప్త సాగారాలు దాటి సైడ్ బి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక ఆ తర్వాతి స్థానంలో అనగా టాప్ 4లో దర్శన్ నిలిచాడు. టాప్ 5లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నిలిచాడు. ఇవండి కన్నడ ఇండస్ట్రీలో టాప్ 5 హీరో హీరోయిన్ల లిస్టు.


Click it and Unblock the Notifications











