మహేశ్‌బాబు మించి గౌతమ్.. ఒడిస్సీ ప్రీమియర్‌లో స్టైలిష్ లుక్‌తో ఘట్టమనేని వారసుడు అదుర్స్!

టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా, అమ్మాయల కలల రాకుమారుడిగా దూసుకెళ్తున్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. 50 ఏళ్లు దాటినా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ మగాళ్లకి కూడా అసూయ కలిగించే అందంతో మెరిసిపోతున్నారు ప్రిన్స్. చిత్ర పరిశ్రమలో హీరోలంతా తమ వారసులను వెండితెరకు పరిచయం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనిని కూడా వీలైనంత త్వరగా ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా ఘట్టమనేని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే గౌతమ్ లుక్ బయటకు రాగా.. తండ్రికి ఏ మాత్రం తీసిపోని అందంతో మెరిసిపోతున్నాడు ఈ కుర్రాడు. తాజాగా గౌతమ్ ఘట్టమనేనికి చెందిన కొత్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Lenin Day 3 AP, TG Box Office: అఖిల్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు.. ఏపీ, నైజాంలో లెనిన్‌కు ఎన్ని కోట్లంటే?
Lenin Day 3 AP, TG Box Office: అఖిల్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు.. ఏపీ, నైజాంలో లెనిన్‌కు ఎన్ని కోట్లంటే?

2006 అక్టోబర్ 31న మహేశ్ బాబు- నమ్రత దంపతులకు జన్మించారు గౌతమ్ ఘట్టమనేని. చిన్నతనం నుంచే మీడియాకు, పబ్లిక్ లైఫ్‌కు దూరంగా గౌతమ్‌ను ఉంచారు మహేశ్. అమెరికాలో చదువుకున్న గౌతమ్.. తాత, తండ్రుల నుంచి అందం, పర్సనాలిటీని పుణికి పుచ్చుకున్నారు. మొన్నామధ్య జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఈ కుర్రాడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో గౌతమ్ ఎప్పడెప్పుడు హీరోగా లాంచ్ అవుతాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu s Son Gautam Ghattamaneni Stylish Look grabs attention at The Odyssey World Premier in Mumbai

ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం నటులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ పెద్దకుమారుడు రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ త్వరలోనే శ్రీనివాస మంగాపురం మూవీతో లాంచ్ అవుతున్నాడు. అలాగే మంజుల కుమార్తె జాహ్నావి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్ బాబుపైనా గౌతమ్ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే వన్ నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేశ్‌గా గౌతమ్ నటించారు. నటనకు కావాల్సిన మెళకువలు నేర్చుకునేందుకు గాను న్యూయార్క్‌లోని టిస్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరిన గౌతమ్ మరింత రాటుదేలడంతో పాటు తన యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశారు. మొన్నామధ్య తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన చిన్న యాక్టింగ్ వీడియో కూడా వైరల్ అయ్యింది.

Recommended For You
 ప్రభాస్ 'సలార్ 2’లో అఖిల్ అక్కినేని?.. క్లారిటీ ఇచ్చిన లెనిన్ హీరో.. 'అంతా గడ్డం వల్లే'
ప్రభాస్ 'సలార్ 2’లో అఖిల్ అక్కినేని?.. క్లారిటీ ఇచ్చిన లెనిన్ హీరో.. 'అంతా గడ్డం వల్లే'

తాజాగా మరోసారి ఘట్టమనేని వారసుడు అభిమానులకు కనువిందు చేశారు. హాలీవుడ్ దర్శక దిగ్గజం క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఎపిక్ మూవీ ది ఒడెస్సీ జూలై 17వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా కొన్ని ఏరియాలలో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ముంబైలో జరిగిన ప్రీమియర్స్‌కు మహేశ్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని హాజరయ్యారు. బ్లాక్ కలర్ సూట్‌లో మహేశ్‌ను మించి స్టైలీష్‌గా కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

You May Also Like
దీపిక పదుకోన్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్.. భర్తతో కలిసి అలా షాకింగ్‌గా!
దీపిక పదుకోన్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్.. భర్తతో కలిసి అలా షాకింగ్‌గా!

దాంతో మీడియా కెమెరాలన్నీ గౌతమ్‌ని బంధించడానికి పోటీలు పడ్డాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందంలో మహేశ్‌ను మించేలా ఉన్నాడంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే గౌతమ్ ఘట్టమనేని లాంచింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి వారసుడి ఎంట్రీపై మహేశ్ మనసులో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఆ ఎదురుచూపులు ఫ్యాన్స్‌కు తప్పవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X