దీపిక పదుకోన్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్.. భర్తతో కలిసి అలా షాకింగ్‌గా!
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీపికా ప్రస్తుతం తన జీవితంలో అత్యంత అందమైన దశను ఆస్వాదిస్తున్నారు. భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి రెండో బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈసారి గ్లామర్ ఫొటోలు, సినిమా అప్‌డేట్స్ కాకుండా ప్రతి గర్భిణి ఎదుర్కొనే సమస్యను పంచుకున్నారు. అదే సమయంలో బేబి బంప్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఆమె పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ సంగతేంటీ?
ప్రస్తుతం దీపికా గర్భధారణ మూడో దశ (Third Trimester)లో ఉన్నారు. ఈ సమయంలో గర్భిణులకు నిద్రలేమి, వెన్నునొప్పి, అలసట, ఎక్కువసార్లు బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి రావడం వంటి శారీరక మార్పులు సహజం. ఇదే అంశాన్ని దీపిక ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో నిండు గర్భిణి నడవడమే కష్టంగా అనిపించే పరిస్థితిలో రాత్రిపూట పదేపదే బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. ఎలాంటి పెద్ద క్యాప్షన్ లేకుండానే కేవలం ఒక స్మైల్ ఎమోజీతో ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.

అదే సమయంలో బేబీ బంప్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిండు కడుపుతో ఉన్నదీపిక కనిపిస్తోంది. రణవీర్ కూడా దీపికను హత్తుకుని ఫోటోలు దిగారు. ఫోటోలు చూస్తూ.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తల్లిదండ్రులు కావడం ఆనందంగా ఉంది అంటూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. చాలా మంది అభిమానులు ఈ స్టార్ కపుల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
దీపికా, రణ్‌వీర్ సింగ్ వివాహం 2018లో ఇటలీలోని లేక్ కోమోలో జరిగింది. వీరికి 2024 సెప్టెంబర్ 8న తొలుత కుమార్తె దువాకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన తర్వాత సినిమాల కంటే కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని దీపిక నిర్ణయించుకున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కూడా పని గంటలకు పరిమితులు విధిస్తూ కుటుంబం, కెరీర్ మధ్య సమతుల్యతను పాటిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండో ప్రెగ్నెన్సీ ని ప్రకటించారు. ఆ తర్వాత ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచినా, దీపిక మాత్రం కొన్ని సందర్భాల్లో అభిమానులతో తన జీవితంలోని ప్రత్యేక క్షణాలను పంచుకుంటూ ఉంటారు.
కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పటికీ దీపిక కెరీర్‌లో మాత్రం జోరు తగ్గలేదు. త్వరలో ఆమె షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కింగ్' సినిమాలో కనిపించనున్నారు. అలాగే అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమా 'రాకా' లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే.. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'లవ్ అండ్ వార్' సినిమాలో అతిథి పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం దీపిక ప్రెగ్నెన్సీ చివరి దశలో ఉండటంతో అభిమానులంతా రెండో బిడ్డ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications



