March Movie Releases: బాక్సాఫీస్‌పై పాన్ ఇండియా సినిమాల దండయాత్ర.. మార్చిలో విడుదలయ్యే మూవీస్ లిస్ట్ ఇదే..

March 2026 Theatre Releases: తెలుగు చిత్రసీమకు ఫిబ్రవరి నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. సాధారణంగా సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. అయితే.. ఈసారి పరిస్థితి మరింత నిస్సత్తువగా మారింది. గత నెల విడుదలైన సినిమాల్లో కొన్ని కాన్సెప్ట్ పరంగా భిన్నంగా ఉన్నా, ఆ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయనే చెప్పాలి. చిన్న, మధ్యతరహా సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. కానీ, ఏ సినిమా కూడా అదిరిపోయేదనే టాక్ సొంత చేసుకోలేకపోయింది. దీంతో కలెక్షన్లు కూడా అంతగా రాలేదు. ఇక ట్రేడ్ వర్గాలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇప్పుడు మార్చి నెలపైనే ఆశలు పెట్టుకున్నారు.ఈ నెలలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో విడుదలయ్యే సినిమాలివే.. మీరు కూడా ఓ లూక్కేయండి.

మృత్యుంజయ్
టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'. ఈ సినిమాకి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా శ్రీ విష్ణు నటిస్తుండగా, ఆయన సరసన రేబా మోనికా జాన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో రచ్చ రవి, సిజ్జు, అయ్యప్ప, బాలాదిత్య, నంద గోపాల్, కృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రమ్య గున్నం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ మార్చి 6న విడుదల కానున్నది.

March 2026 Theatre Releases Box Office Clash Between Toxic Dhurandhar 2 Ustaad Bhagat Singh

సతీ లీలావతి
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్‌ మోహన్‌ జంటగా నటించిన సినిమా సతీ లీలావతి (Sathi Leelavathi). ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తుంచగా.. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించారు. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటించారు.

నీ మొగుడు.. నీ ఇష్టం.. మాకేం సంబంధం.. టెలివిజన్ నటికి షాక్
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
ప్రముఖ నటుడు శివాజీ హీరోగా, లయ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'. ఈ మూవీకి సుధీర్‌ శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్‌ సంస్థ సమర్పణలో రూపొందించారు. ఈ మూవీ మార్చి 6న వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . సంప్రదాయం, గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది.
Thaai Kizhavi 3 days Box Office: వీకెండ్‌లో అదరగొట్టిన తాయ్ కెలవి .. రాధిక మూవీకి ఎన్ని కోట్లంటే?
బ్యాండ్‌ మేళం
'కోర్ట్‌' జోడీ హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి జంటగా నటించిన సినిమా 'బ్యాండ్‌ మేళం (Band Melam)'. ఈ సినిమాకు సతీష్‌ జవ్వాజీ దర్శకత్వం వహించగా.. కావ్య, శ్రావ్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ మార్చి 13న విడుదల కానున్నది. ఈ మూవీలో సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తుండగా.. కెమెరా సతీష్‌ ముత్యాల, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌లో నిర్మాణం జరుగుతోంది. యువతను థియేటర్లకు రప్పించగలిగితే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశముంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రమోషన్లు బలంగా సాగుతుండటం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.

టాక్సిక్ (Toxic: A Fairy Tale for Grown-Ups)
అసలు బాక్సాఫీస్ హీట్ మాత్రం మార్చి 19న మొదలవుతుంది. ఆ రోజు రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు పోటీ పడనున్నాయి. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా విజువల్‌గా గ్రాండ్‌గా విడుదల కానున్నది. యశ్‌కు 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ తర్వాత వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ఈ సినిమాకు భారీ అడ్వాంటేజ్. నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్ యాక్టర్ నటించడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ధురంధర్ 2 (Dhurandhar: The Revenge)
అదే రోజు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన కూడా ధురంధర్ 2 కూడా విడుదలవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సీక్వెల్‌పై హైప్ భారీగా ఉంది. ధురంధర్ పార్ట్ 1 హిందీలోనే దక్షిణాదిలో మంచి వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి తెలుగు డబ్బింగ్‌తో నేరుగా విడుదలవుతుండటంతో మార్కెట్ విస్తరించే అవకాశం ఉంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఇంటెన్స్ కథనం ఈ సినిమాకు ప్రధాన బలం.ఇక చూడాలి ఈ సిక్వెల్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో.

ఆడు 3 ( Aadu 3)
మలయాళ కామెడీ ఫ్రాంచైజీ ఆడు 3 కూడా మార్చి 19న విడుదలవుతోంది. జయసూర్య ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా కేరళలో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. ఒకే రోజు నాలుగు చిత్రాలు విడుదలవుతుండటంతో స్క్రీన్ కౌంట్ విభజన కీలక అంశంగా మారనుంది. ఈ క్లాష్ ఫలితం బాక్సాఫీస్ దిశను మార్చే అవకాశం ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ - హరీష్ కాంబినేషన్ మళ్లీ కావడంతో భారీ హైప్స్ పెంచేశాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. మార్చి చివరి వారంలో సోలో భారీ తెలుగు రిలీజ్ కావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా భారీ రికార్డులు సృష్టించే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మార్చిలో విడుదల అయ్యే సినిమాల జాబితా..
చరక్: ఫెయిర్ ఆఫ్ ఫెయిత్ (Charak: Fair Of Faith) మార్చి 6,
నా జానే కౌన్ ఆ గయా (Na Jaane Kaun Aa Gaya) మార్చి 6,
కిస్సా కోర్ట్ కచహరి కా (Kissa Court Kachahari Ka) మార్చి 13న,
ఆడు 3 (Aadu 3) మార్చి 19
ధురంధర్:ది రివెంజ్ (Dhurandhar: The Revenge) మార్చి 19,
టాక్సిక్ (Toxic: A Fairy Tale for Grown-Ups) మార్చి 19,
యూత్ (Youth)మార్చి 19,
ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మార్చి 26,

ఇలా ఈ నెల భారీ పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్‌ను దద్దరిల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సినీ ప్రియులకు ఇది నిజంగా పండగ నెలగా మారబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిస్తోందో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: toxic ustaad bhagat singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X