Niharika Konidela: ఇప్పుడు నేనూ తోపునే... నిహారిక కొణిదెల ఎమోషనల్
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను జూలై 18వ తేదీన భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీలో ఈ సినిమాకు అవార్డులను ప్రకటించింది కేంద్రం. దాంతో చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటోంది. దీనిలో భాగంగా జూలై 19న హైదరాబాద్‌లో కమిటీ కుర్రోళ్లు టీమ్ వేడుకలు జరుపుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. 32 ఏళ్ల నా జీవితంలో ఏదైనా మంచి పని చేశానంటే కమిటీ కుర్రోళ్లు తీసినప్పుడే. రెండేళ్ల నుంచి ఒక మనిషి నన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నాడు.. సరే కథ వింటానని వంశీని పిలిపించాను. ఒక మంచి సినిమా తీసినప్పుడు.. దానిని ఆడియన్స్‌కి చేరువ అయ్యేలా ప్రమోషన్స్ చేయాలి, వాళ్లకి మెంటల్ వచ్చేలా ప్రమోషన్స్ చేశాం. ప్రతి చిన్న ఊరికి వెళ్లి ఆడియన్స్‌కి చెప్పాం. సినిమా బాగోకపోతే మనం ఎంత ప్రమోట్ చేసినా సినిమా హిట్ అవ్వదు.. కమిటీ కుర్రోళ్లు కోసం అందరు చెమట చిందించారు. ప్రతి ఒక్కరి పేరెంట్స్‌తో నేను మాట్లాడాను.. ఇది నేషనల్ అవార్డ్ సినిమా అని వంశీ గారు ప్రతిరోజూ చెప్పేవారు. కానీ నేషనల్ అవార్డ్ సినిమా నిర్మించాలని నా డ్రీమ్‌లో ఎప్పుడూ లేదని నిహారిక తెలిపారు.

కమిటీ కుర్రోళ్లు గురించి నా విజన్ బోర్డ్‌లో రాసుకున్నాను. ఇప్పుడు 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ సినిమా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. మేకప్ ఆర్టిస్ట్ అభి కుమార్ మేమందరం బాబీ అని పిలుస్తాం.. అసలు బాబీకి నేషనల్ అవార్డ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో బాబీ ప్లేస్ ఏంటీ అనేది అందరికీ తెలుసు.. నేనే నెంబర్ వన్ అయితే, రమేశ్ గారు నెంబర్ 2, బాబీ నెంబర్ 3. ఇతనికి మేకప్‌కి కాదు .. మంచితనానికి, విధేయతకు నేను నీకు ఇస్తానని నిహారిక పేర్కొన్నారు.
నాన్నగారికి రుద్రవీణకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇది ఆయన తొలి సినిమా.. 36 ఏళ్ల క్రితం చేశారు, నేను పుట్టలేదు కూడా. కమిటీ కుర్రోళ్లకి నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పినప్పుడు కూడా ముందే ఎందుకు మాట్లాడుకోవడం అనిపించేది. నా ఫ్యామిలీలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కుటుంబానికి పేరు తీసుకొచ్చారు, అలాగే సినీ పరిశ్రమకు కూడా ఎంతో సేవ చేశారు. మెగా ఫ్యామిలీలో ఉన్నానంటే ఉన్నాను అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు కమిటీ కుర్రోళ్లు వల్ల మెగా ఫ్యామిలీలో మెంబర్‌గా ఉండటానికి నేను అర్హురాలినే అనే గుర్తింపు వచ్చిందని నిహారిక ఎమోషనల్ అయ్యారు.
నాకు సినిమా తప్పించి ఏం రాదు.. మంచి సినిమాలు ఎక్కడున్నా నా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వద్దకు రావాలి. కమిటీ కుర్రోళ్లు సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ ఇచ్చినందుకు జ్యూరీ మెంబర్స్‌కు కృతజ్ఞతలు. మాతో పాటు జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపికైన టాలీవుడ్ కుటుంబ సభ్యులందరికీ కంగ్రాట్స్. ఈ సినిమా రిలీజైనప్పుడు కూడా మీడియా వాళ్లు, ఆడియన్స్, మా నాన్న అందరూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పారు. నిన్ననే అవార్డ్స్ అనౌన్స్ చేశారు కాబట్టి నేను అందరు దగ్గరికి వెళ్లలేదు.. చిరంజీవిగారు, సురేఖ మమ్మీ చాలా సంతోషంగా ఉన్నారు. రుద్రవీణ సమయంలో డాడీ వెళ్లి నేషనల్ అవార్డ్ తీసుకున్నారు. అప్పుడు మీ నాన్న తీసుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకోబోతున్నావు చాలా గర్వంగా ఉందని అన్నారు. ఆయనే ఇండస్ట్రీకి గర్వకారణం అని నేను ఫీల్ అవుతూ ఉంటాను.. అలాంటిది ఆయనే నన్ను ప్రైడ్ అన్నారంటే తోపే తోపు అంటుంటు నేను ఖచ్చితంగా తోపునే. సినిమా తీయాలనే ప్యాషన్ నాకు ఉండొచ్చు.. కానీ సరైనా మనుషుల్ని కలవాలి కదా అని నిహారిక ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మెగా అభిమానులు నిహారికకు కంగ్రాట్స్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications


