Paruchuri Gopala Krishna: "నా సామి రంగాలో ఆ రెండు పాత్రలను చంపేయకపోతే.. నెక్ట్స్ లెవెల్‌లో ఉండేది"

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తాజాగా వచ్చిన సినిమా నా సారి రంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈ సినిమా హిట్ గా నిలిచింది. ఎవరూ ఊహించని స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా గురించి, ఇందులో నటించిన వారందరికీ గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ స్పందించారు. సినిమాలో కొన్ని తప్పులు చేసి ఉండకపోతే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేదని వివరించారు. అయితే ఆ తప్పులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన నా సామి రంగా చిత్రానికి విజన్ బిన్ని దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ నటించి మెప్పించగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రావు రమేష్, నాజర్ వంటి వాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 14వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం... ఫిబ్రవరి 17వ తేదీ నుంచి హాట్ స్టార్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇదంతా ఇలా ఉండగా.. పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడారు.

46 ఏళ్ల వయసులోనూ నునులేత అందాలు.. నయా లుక్‌లో మంచుగారమ్మాయిని చూశారా?

Paruchuri Gopala Krishna Shocking Comments About Nagarjuna Naa Saami Ranga Movie Check Details

ఈ సినిమాలో నాగార్జున పాత్ర అద్బుతంగా ఉందని.. ముఖ్యంగా నాగ్ కళ్లతోనే నటించడం చాలా బాగా ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు. విజయ్ బిన్ని కేరళ స్టైల్ లో.. ఈ సినిమాలోని అంతా లుంగీలు కట్టుకుని కాన్సెప్ట్ ను పెట్టారని.. చెప్పుకొచ్చారు. మన్నథుడు, రొమాంటిక్ హీరోగా చూస్తున్న నాగార్జున ఊర మాస్ గా.. ముఖ్యంగా లుంగీ కట్టుకుని నరకడం ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించదన్నారు. నాగార్జున ఈ పాత్రను చాలా ప్రేమించడం వల్లే అంత చక్కగా చేయగలిగాలని ప్రశంసించారు.

అయితే ఈ సినిమాలో కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నాయని పరుచూరి గోపాల కృష్ణ వెల్లడించారు. ముఖ్యంగా సినిమా మొదటి పార్టులో రావు రమేష్ ను విలన్ గా చూపించడం.. ఆ తర్వాత అతడిని చంపేయడం సరిగ్గా అనిపించలేదని అన్నారు. ఇంటర్వెల్ కు ముందు అతడిని చంపేయడంతో.. రెండో పార్ట్ లో విలన్ ను పరిచయం చేయడం, కొత్త వాళ్లను తీసుకురావడంతో.. ట్రాక్ మార్చినట్లు అనిపించిందని వివరించారు. అలాగే అల్లరి నరేష్ పాత్ర కూడా చాలా చక్కగా ఉందని.. కానీ అతడిని కూడా చంపేసి ఉండకపోతే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని పేర్కొన్నారు.

డైరెక్ట్‌గా OTTలోకి వచ్చేసిన సూపర్ క్రైమ్ థ్రిల్లర్.. డేర్ ఉంటే అక్కడ చూసేయండి!

Paruchuri Gopala Krishna Shocking Comments About Nagarjuna Naa Saami Ranga Movie Check Details

సినిమాలో ఒక పెద్ద హీరో ఉన్నప్పుడు... హీరో తరఫు వాళ్లను చంపడాన్ని ప్రేక్షకుల జీర్ణించుకోలేరని.. అలా జరిగితే చూసి తట్టుకోలేరని అన్నారు. అప్పటి వరకూ చాలా బాగా ఫైట్లు చేసిన నరేష్ చనిపోకుండా... కనీసం ఆసుపత్రిలో ఉన్నట్లు అయినా చూపిస్తే చాలా బాగుండేదని పరుచూరి వెల్లడించారు. ముగ్గురు హీరోలను సినిమాలో పెట్టుకుని.. ఒకరి లవ్ స్టోరీనీ మాత్రమే హైలెట్ చేస్తూ కథ చెప్పిన విధానం చాలా బాగుందని అన్నారు. కానీ ఈ రెండు తప్పులు జరగకపోయి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేదని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X