S Janaki Net Worth: మూగబోయిన గాన కోకిల... ఎస్ జానకి ఆస్తులు ఎన్ని వందల కోట్లంటే?

లెజెండరీ సింగర్ ఎస్ జానకి ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ జూలై 11న కర్ణాటక రాష్ట్రం మైసూరులో ఆమె తుదిశ్వాస విడిచారు. జానకి మరణంతో సినీ రంగం విషాదంలో మునిగిపోయింది. ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు, సంగీత అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. దాదాపు 6 దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో 50 వేలకు పైగా పాటలతో ప్రేక్షకులను అలరించారు జానకి. ఆమె మరణంతో భారతీయ సినీ నేపథ్య సంగీత చరిత్రలో ఒక శకం ముగిసినట్లయ్యింది.

Also Read
Rao Bahadur Day 9 Collections: పడిపోయిన రావు బహదూర్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
Rao Bahadur Day 9 Collections: పడిపోయిన రావు బహదూర్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె పల్లపట్ల అనే మారుమూల గ్రామంలో జన్మించిన జానకి భారతదేశం గర్వించదగ్గ గాయనిగా ఎదిగారు. తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో గడిచింది. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఎంతో ముక్కువ కనబరిచిన జానకి.. మూడేళ్ల వయసులోనే వేదికలపై పాటలు పాడటం ప్రారంభించారు. నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దారు.

S Janaki Net Worth Legendary Singer s Wealth Career and Global Legacy

1957లో తమిళ చిత్రం విధియిన్ విలయాత్తులో తొలిసారిగా గాయనిగా కెరీర్ ప్రారంభించారు. ఘంటసాల నుంచి ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం వరకు ఎందరో దిగ్గజ గాయకులతో కలిసి పాటలు పాడారు జానకి. అయితే బాలుతో పడిన ఆమె పాడిన డ్యూయెట్‌లు అప్పట్లో అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయి. 2017 అక్టోబర్‌లో కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. చివరిసారిగా అమ్మాపోవిను అనే మలయాళ పాటను రికార్డ్ చేసి సెలవు ప్రకటించారు. సినిమాలతో పాటు కచేరీలలోనూ పాటలు పాడేది లేదని తేల్చిచెప్పారు. ఆ నిర్ణయం మేరకే నడుచుకున్నారు జానకి.

Recommended For You
Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?
Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?

వి రామ్ ప్రసాద్‌ను 1959లో పెళ్లాడిన జానకి భర్తతో కలిసి చెన్నైలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఇతనికి చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు జానకి. అలాగే పలు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ మురళీకృష్ణ నటించారు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు వంటి సినిమాలలో నటించారు. కూలింగ్ గ్లాస్ అనే మలయాళ సినిమాకు రచయితగానూ పనిచేశారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1997లో జానకి భర్త వి రాంప్రసాద్ మరణించారు. ఇక ఈ ఏడాది జనవరి 26న జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూయడంతో ఆమె షాక్‌కు గురయ్యారు. కుమారుడి మరణంతో బాగా కృంగిపోయారు. ఇప్పుడు తను కూడా అనారోగ్యంతో కన్నుమూసి సినీ సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచారు.

You May Also Like
ప్లే బ్యాక్ సాంగ్‌లో మిమిక్రీతో అరుదైన ఘనత... అజరామరం జానకమ్మ గాత్రం!
ప్లే బ్యాక్ సాంగ్‌లో మిమిక్రీతో అరుదైన ఘనత... అజరామరం జానకమ్మ గాత్రం!

ఆరు దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో 50 వేలకు పైగా పాటలు పాడిన జానకి.. ఎంత సంపాదించారు? ఆమె ఆస్తులు ఎంత? అంటూ నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయనిగా జానకి దూసుకెళ్లారు. ఆ రోజుల్లో ఆమె లక్షల్లో పారితోషికం తీసుకున్నట్లుగా పలువురు చెబుతున్నారు. గాయనిగా బాగానే ఆస్తుల్ని కూడబెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా పాటలే ఆమెకు ప్రధాన ఆదాయం. వేల సంఖ్యలో ఉన్న పాటలు, దేశ విదేశాల్లో నిర్వహించిన స్టేజ్ షోలు, పలు సాంస్కృతిక కార్యక్రమాల కారణంగా జానకి సంపద పెరగడంలో కీలకపాత్ర పోషించినట్లుగా ఫిలింనగర్ టాక్. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో జానకికి ఇళ్లు, ఆస్తులు ఉన్నాయని ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా జానకి ఆస్తుల విలువ 537 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

Read more about: s janaki movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X