Rao Bahadur Day 9 Collections: పడిపోయిన రావు బహదూర్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రావు బహదూర్. దీపా థోమస్ హీరోయిన్‌గా నటించగా.. వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. స్మరణ్ సాయి సంగీతం అందించారు. వెంకటేష్ మహా.. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఏ+ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణా రెడ్డి, ఈశ్వరన్ విజయ రాఘవన్‌లు నిర్మించారు. జూలై 3న వరల్డ్ వైడ్‌గా రావు బహదూర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో రావు బహదూర్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 9వ రోజు ఈ సినిమా ఎంత వసూలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
రావు బహదూర్ బడ్జెట్
బహదూర్ మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను నిర్మాతలు, జీఎంబీ సంస్థలు సొంతంగా విడుదల చేశాయి. అయితే రావు బహదూర్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 25 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. సత్యదేవ్ మూవీకి తొలిరోజున ఇండియాలో 1.40 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.40 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.24 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 39 లక్షల రూపాయలు, ఐదో రోజున 35 లక్షల రూపాయలు, ఆరో రోజున 38 లక్షల రూపాయలు, ఏడో రోజున 29 లక్షల రూపాయలు, ఎనిమదో రోజున 23 లక్షల రూపాయలు వసూలు చేసింది.

రావు బహదూర్ 8 రోజుల కలెక్షన్స్
ఇప్పటి వరకు ఇండియా 5.68 కోట్ల రూపాయల నెట్.. 6.27 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. తెలంగాణలో 3.80 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 2.78 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 73 లక్షల రూపాయలు, తమిళనాడులో 8.50 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 2.50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.
రావు బహదూర్ ఓవర్సీస్ కలెక్షన్స్
ఓవర్సీస్‌లో గురువారం వరకు నార్త్ అమెరికాలో380K డాలర్లు (3.63 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ప్ తదితర దేశాలలో రావు బహదూర్ మూవీ 425K డాలర్లు (4.06 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అధికారికంగా వెల్లడించారు. అయితే శుక్రవారం నాటికి ఈ మొత్తం 4.50 కోట్ల రూపాయలకు చేరింది. భారత్‌లో వచ్చిన కలెక్షన్స్‌తో కలిపి రావు బహదూర్ మూవీకి వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 10.77 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది. శుక్రవారం అఖిల్ నుంచి లెనిన్ సహా హిందీలో ధమాల్ 4 తదితర సినిమాలు విడుదల కావడంతో నార్త్ అమెరికాలో రావు బహదూర్ బుకింగ్స్ భారీగా పడిపోయాయి. ఈ వీకెండ్ తర్వాత సత్యదేవ్ మూవీ జర్నీ ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
రావు బహదూర్ 9వ రోజు వసూళ్ల అంచనా
తొలి వీకెండ్ వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన రావు బహదూర్ మూవీ.. మండే టెస్ట్‌లో ఫెయిలై దారుణంగా బుకింగ్స్ కోల్పోయింది. రోజు రోజుకు వసూళ్లు పడిపోతుండగా శుక్రవారం అఖిల్ నటించిన లెనిన్ మరింత దెబ్బకొట్టింది. సెకండ్ వీకెండ్ మీదే రావు బహదూర్ టీమ్ ఆశలు పెట్టుకుంది. 9వ రోజు ఇండియా వైడ్‌గా సాయంత్రం 4 గంటల వరకు కేవలం 80 షోలు ప్రదర్శితమై కేవలం 21.2 శాతం ఆక్యూపెన్సీ మాత్రమే సాధించినట్లు ట్రాక్ టాలీవుడ్ పేర్కొంది.
ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి రావు బహదూర్ మూవీ శనివారం కేవలం 8 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. 9వ రోజు వరల్డ్ వైడ్‌గా సత్యదేవ్ సినిమా 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్ధితులతో వీకెండ్ తర్వాత రావు బహదూర్ మూవీ థియేట్రికల్ రన్ ఎలా సాగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉండగా.. టార్గెట్‌కు 14 కోట్ల రూపాయల దూరంలో నిలిచింది.


Click it and Unblock the Notifications



