This Week Film Releases.. కన్నడలో 8, తమిళంలో 5, తెలుగులో 5 సినిమాలు.. ఏ చిత్రాల్లో హీరో, హీరోయిన్లు ఎవరంటే?
సినీ పరిశ్రమలో చిన్న, మధ్య తరగతి బడ్జెట్ సినిమాలు ఈ శుక్రవారం అంటే మార్చి 15వ తేదీన తమ భవితవ్యాన్ని చూసుకోబోతున్నాయి. చిన్న సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీకి తెరలేచింది. తెలుగులో దాదాపు 4 సినిమాలు, హిందీలో 2 సినిమాలు, మలయాళంలో 3 సినిమాలు, తమిళంలో 5 సినిమాలు, కన్నడలో 8 సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఈ సినిమాల వివరాల్లోకి వెళితే..
కన్నడ సినిమా రంగంలో
కన్నడ సినిమా రంగంలో చిన్న సినిమాల హవా భారీగా కొనసాగుతున్నది. మార్చి 15వ తేదీన చో చో బాత్ (Chow Chow Bath), సోము సౌండ్ ఇంజినీర్ (Somu Sound Engineer), ఫోటో (Photo), లైన్‌మెన్ (Lineman), కెరెబెటే (Kerebete), వ్యూహా (Vyooha), హైడ్ అండ్ సీక్(Hide and Seek), మహబూబా (Mahabooba) సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లైన్‌మెన్ సినిమాలో త్రిగుణ్, కాజల్ సుందర్, జయశ్రీ, హరిణి శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు రఘు శాస్త్రీ దర్వకత్వం వహిస్తున్నారు.

తమిళంలో 5 సినిమాలు
తమిళంలో ఐదు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మలయాళంలో ఘన విజయం సాధించిన ప్రేమలు (Premalu), అమిగో గ్యారేజ్ (Amigo Garage), డెవిల్ హంటర్ (Devil Hunters), యావరమ్ వల్లవారే (Yaavarum Vallavare), కాడువెట్టి (Kaaduvetty) చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ చిత్రాల్లో యావరమ్ వల్లవారే సినిమా కొంత బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో సముద్రఖని, యోగిబాబు, రిత్విక, మొట్టై రాజేంద్రన్, రమేశ్ తిలక్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేంద్ర చక్రవర్తి దర్వకత్వం వహించారు.

మలయాళ సినీ పరిశ్రమలో
మలయాళ భాషలో ఆంచక్కల్లకొక్కన్ (Anchakkallakokkan), జననం: 1947 ప్రణయం తుడరుణ్ణు (Jananam: 1947 Pranyam Thudarunnu), డయల్ 100 (Dail 100) సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో భ్రమయుగం, ప్రేమలు, ముంజుమ్మేల్ బాయ్స్ లాంటి సినిమాలు ఘన విజయం సాధించిన తర్వాత చిన్న సినిమాల ప్రవాహం మొదలైంది.

హిందీలో అదా శర్మ
ఇక హిందీలో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి బస్తర్: ది నక్సల్ స్టోరి (Bastar: The Naxal Story), యోధ (Yodha) సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. యోధ చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా, దిశా పటానీ, రాశీ ఖాన్నా తదితరులు నటిస్తున్నారు. ది కేరళ స్టోరి రూపొందించిన టీమ్ బస్తర్ చిత్రాన్ని తెరకెక్కించారు. అదాశరమ, శిల్పా శుక్లా, యశ్‌పాల్ శర్మ, సుబ్రత్ దత్తా, రైమా సేన్ తదితరులు నటించారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సుదిప్టో సేన్ దర్శకత్వం వహించారు.

ఇక తెలుగులో 5 సినిమాలు రిలీజ్‌కు సిద్దమయ్యాయి. అనన్య నాగళ్ల నటించిన తంత్ర (Tantra), చైతన్య రావు, భూమిశెట్టి నటించిన షరతులు వర్తిస్తాయి (Sharatulu Varthistayi), నైజాం పాలనలో హిందువులపై దురాగాతాలు చేసిన రజాకార్ల కథతో రజాకార్ (Razakar), వేయ్ దురువేయ్ (Vey Daruvey), స్వామి నాగులకొండ (Swamy Nagulakonda) చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు ఏవైనా సంచలనాలు క్రియేట్ చేస్తాయో వేచి చూడాల్సిందే.
ఇండస్ట్రీ వాళ్లు వాడుకొని వదిలేస్తారు.. అనన్య నాగళ్ల



Click it and Unblock the Notifications











