This Week Movie Releases: ఎట్టకేలకు థియేటర్‌‌లలోకి జన నాయగన్.. ఇంకా ఈ వారం రిలీజయ్యే సినిమాలు ఇవే!

ప్రతివారం మాదిరిగానే ఈ వారం కూడా చిన్నా, పెద్దా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి ముందుకొస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగర్ ఈ వారమే విడుదల కానుంది. మరి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు హాలీవుడ్‌లోనూ చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీక్ రిలీజయ్యే సినిమాలను పరిశీలిస్తే..

This Week Movie Releases Jana Nayagan The India Story Chennai Love Story and More Films Hitting Theatres

జన నాయగన్:
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ నటించిన చివరి చిత్రం జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు). సెన్సార్, చట్టపరమైన కారణాల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమైన సంగతి తెలిసిందే. అన్ని సమస్యలను పరిష్కరించుకుని జూలై 23న జన నాయగన్ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. జన నాయగన్‌ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. దళపతి విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, సునీల్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’

ది ఇండియా స్టోరీ:
అగ్రనటి కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన సినిమా ది ఇండియా స్టోరీ. దేశంలో జరుగుతున్న ఆహార కల్తీ, ఫుడ్ పాయిజన్ తదితర అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బీ షిండే నిర్మిస్తున్నారు. శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా, అతుల్ తివారి, కమలేష్ సావంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిషాంత్ భగవత్ సినిమాటోగ్రాఫర్‌గా, మంగేష్ ధాక్డే సంగీత దర్శకుడిగా, అనీశ్ మాత్రే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. జూలై 24న ది ఇండియా స్టోరీ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

Recommended For You
ఆమె మాట్లాడితే బూతులే.. జబర్దస్త్ యాంకర్‌పై కమెడియన్ షాకింగ్ కామెంట్స్
ఆమె మాట్లాడితే బూతులే.. జబర్దస్త్ యాంకర్‌పై కమెడియన్ షాకింగ్ కామెంట్స్

చెన్నై లవ్ స్టోరీ:
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన మూవీ చెన్నై లవ్‌స్టోరీ. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌లు ఈ సినిమాను నిర్మించగా.. రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేశ్ ఈ సినిమాకు కథను అందించారు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ చాలాకాలం తర్వాత ఈ మూవీకి సంగీతం అందించారు. సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూలై 24న చెన్నై లవ్ స్టోరీ విడుదల కానుంది.

You May Also Like
క్లోజ్ ఫ్రెండ్సే అలా చులకనగా.. భార్యతో ఏజ్ గ్యాప్‌పై సాయాజీ షిండే రియాక్షన్
క్లోజ్ ఫ్రెండ్సే అలా చులకనగా.. భార్యతో ఏజ్ గ్యాప్‌పై సాయాజీ షిండే రియాక్షన్

సత్యవాన్ సావిత్రి:
కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటించిన మూవీ సత్యవాన్ సావిత్రి. మిస్కిన్, చారుకేశ్, బాల శరవణన్, శిల్పా మంజునాథ్ తదితరులు నటించారు. డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై వేదిక్కరన్‌పట్టి ఎస్ శక్తివేల్ నిర్మించగా ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కీర్తీ సురేష్ లాయర్‌గా కనిపించనున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందించగా.. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్‌గా.. ప్రసన్న జీకే ఎడిటర్‌గా ‌వ్యవహరించారు. జూలై 24న తమిళంలో సత్యవాన్ సావిత్రి మూవీ విడుదల కానుంది.

'నా శరీరంపై అక్కడ తాకుతూ పైశాచిక ఆనందం.. అలా బుద్ధి చెప్పా’
'నా శరీరంపై అక్కడ తాకుతూ పైశాచిక ఆనందం.. అలా బుద్ధి చెప్పా’

ఇంద్రజాల్:
మహేశ్ నికమ్, శానయా త్రిపాతి జంటగా నటించిన మూవీ ఇంద్రజాల్. యశ్‌రాజ్ దింబాల్, నామ్‌దేవ్ ముర్కుటే, కిరణ్ మనే, కల్పన సారంగ్, దర్శనా రసల్, ధీరజ్ శర్మ, సత్యం ఛత్రి, రాహుల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. శివరత్న ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుచేత అజయ్ నికం ఈ సినిమాను నిర్మించగా.. జగదీశ్వర్ లలిత ధోబ్లే దర్శకత్వం వహించారు. ఆకాష్ సేథీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. గౌరవ్ చాటి సంగీతం అందించారు. జూలై 24న హిందీలో ఇంద్రజాల్ మూవీ విడుదల కానుంది.

The Odyssey Day 2 Collections: ది ఒడిస్సీ వసూళ్ల ఊచకోత.. రెండో రోజు క్రిస్టోఫర్ నోలన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
The Odyssey Day 2 Collections: ది ఒడిస్సీ వసూళ్ల ఊచకోత.. రెండో రోజు క్రిస్టోఫర్ నోలన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇవి కాకుండా జూలై 24న తెలుగులో చంద్రప్పన్.. తమిళంలో ఇమ్మోర్టల్... హిందీలో మ్యాక్స్ మిని మియోజాకి, ఉత్తర్ దా పుత్తర్, తేరా యార్ హూన్ మై, దుల్హానియా లే అయాగే.. కన్నడంలో లైఫ్ ఈల్లింద్ ఇలిగే, శ్రీమతి సింధూర, కారావళి... ఇంగ్లీష్‌లో మోటర్ సిటీ సినిమాలు విడుదల కానున్నాయి. మరి వీటిలో ప్రేక్షకుల అభిమానాన్ని ఏ చిత్రాలు సంపాదించుకుంటాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X