Upcoming Movies in December: సినిమాల జాతర.. అఖండ 2 నుండి అవతార్ 3 వరకు..

Upcoming Movies in December: 2025 డిసెంబర్ సినీ ప్రేక్షకులకు పండుగలా మారబోతోంది. సాధారణంగా సంక్రాంతి సీజన్‌లోనే భారీ సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ ఈసారి డిసెంబర్ నెలనే వరుసగా పెద్ద సినిమాలు థియేటర్లకు రానున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, హాలీవుడ్ చిత్రాల వరకు... అన్ని ఇండస్ట్రీలలో డిసెంబర్ బాక్సాఫీసును టార్గెట్ చేయడంతో థియేటర్ల వద్ద భారీ రద్దీ కనిపించనుంది. ఏ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుంది? అని వివరాలు మీకోసం..

'అఖండ 2: తాండవం'(Akhanda 2: Thaandavam).
నటసింహం నందమూరి బాలకృష్ణ అఘోర అవతారంలో సునామి సృష్టించిన 'అఖండ'. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన 'అఖండ 2: తాండవం' డిసెంబర్ 5న విడుదల అవుతోంది. బోయపాటి శ్రీను మాస్ ఫ్లేవర్‌తో తెరకెక్కించిన ఈ మూవీపై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సనాతన ధర్మం కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్తా, ఆది పినిశెట్టి, బాలబాలిక హర్షాలీ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తోంది వేచి చూడాలి.

Upcoming Movies in December 2025 Akhanda 2 to Avatar 3 Box Office Turns Festival Season

ధురంధర్
బాలీవుడ్ నుంచి కూడా భారీ సినిమా రంగంలోకి దిగుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై-యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' కూడా డిసెంబర్ 5నే రిలీజ్. నిజ జీవిత ఆపరేషన్ల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మాస్ హీరోలు రెండు ఇండస్ట్రీల నుంచి ఒకే రోజున పోటీ పడటంతో బాక్సాఫీసులో మొదటి వారం పోటీ తీవ్రంగానే ఉండబోతుందని తెలుస్తోంది.

మోగ్లీ
డిసెంబర్ రెండో వారంలో రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ మూవీ 'మోగ్లీ' డిసెంబర్ 12 విడుదల కానున్నది. సాక్షీ సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, లవ్-యాక్షన్ ఎలిమెంట్ల మేళవింపుతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అదే తేదీన రామ్ కిరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సకుటుంబానాం' కూడా థియేటర్లకు రానుంది. ఉదయ్ శర్మ దర్శకత్వంలో మెఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంది.

Samantha Networth: సమంత నికర ఆస్తులు ఎన్ని కోట్లు? రాజ్ నిడిమోరు కంటే ఎన్ని కోట్లు ఎక్కువ?
శంబాల
క్రిస్మస్ వారం అయితే.. బాక్సాఫీస్ పోటీ మరింత పెరగనున్నది. ఆది సాయి కుమార్ హీరోగా 'శంబాల' అనే సై-ఫై ఫాంటసీ మూవీ డిసెంబర్ 25 విడుదల కాబోతుంది. దర్శకుడు యుగంధర్ ముని ఈ మూవీని తెరకెక్కించారు. హీరో ఆది శాస్త్రవేత్తగా నటించగా, కీలక పాత్రల్లో అర్చన అయ్యర్, శ్వాసిక కనిపించనున్నారు.

ఛాంపియన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన స్పోర్ట్స్-డ్రామా 'ఛాంపియన్' కూడా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫుట్‌బాల్ నేపథ్యంతో పాటు ప్రేమ-దేశభక్తి అంశాలను కలిపి దర్శకుడు ప్రదీప్ అద్వైత్ ఈ సినిమాను తీర్చిదిద్దారు. అదియే కాక శివాజీ, నవదీప్, బిందుమాధవి, రాహుల్ రామకృష్ణ వంటి నటులతో తెరకెక్కిన 'దండోరా', తెలంగాణ గ్రామీణ నేపథ్య డ్రామాగా డిసెంబర్ క్రిస్మస్‌ రోజునే థియేటర్లలోకి రానుంది.

ఇక్కీస్
మోస్ట్ అవైటెండ్ మూవీలో 'ఇక్కీస్' ఒకటి. పరమవీర చక్ర అవార్డు విజేత అరుణ్ ఖేతర్‌పాల్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన బయోపిక్. ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కీలక పాత్ర పోషించారు. ఆయన మరణానికి ముందు చేసిన చివరి సినిమా కావడంతో ఈ విడుదలకు సినీ ప్రేమికుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

Raju Weds Rambai Day 10 Collection: రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్ల జోరు.. 10 వ రోజు ఎన్ని కోట్లంటే?
'అవతార్ 3: ఫైర్ అండ్ యాష్'
హాలీవుడ్ వైపు చూస్తే జేమ్స్ కామెరూన్ మళ్ళీ ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫ్రాంచైజ్‌గా నిలిచిన 'అవతార్' సిరీస్ మూడో భాగం 'అవతార్ 3: ఫైర్ అండ్ యాష్' ఈ డిసెంబర్ 19న విడుదల కానున్నది. పాండోర ప్రపంచాన్ని పరిచయం చేసిన తర్వాత సముద్ర గాథను 'ది వే ఆఫ్ వాటర్'తో చూపించిన దర్శకుడు, ఈసారి అగ్ని అనే మూలభూతం చుట్టూ మొత్తం కథను నడిపించనున్నారు. టెక్, విజువల్ ఎఫెక్ట్స్, వర్డల్ లెవల్ టేకింగ్ కామెరూన్ బ్రాండ్‌.

అంతేకాకుండా డిసెంబర్ లో మోహన్‌లాల్ నటించిన 'వృషభ', హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ 'అనకొండ', గుణశేఖర్ యువ సినిమా 'యుఫోరియా' వంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇలా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి ఒకే నెలలో భారీ సినిమాలతో బరిలోకి దిగుతుండటంతో డిసెంబర్ నిజంగా ప్రేక్షకులకు సినిమాల పండుగగా మారబోతోంది. ఏ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధిస్తుందో.. ఏ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందో వేచి చూడాలి?

More from Filmibeat

Read more about: nandamuri balakrishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X