10ఏళ్ల నిరీక్షణకు 'లెనిన్'తో తెర.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటి?

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని వారసుడిగా 'అఖిల్'సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, అఖిల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత వరుసగా హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి సినిమాలతో కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో ఆయన కెరీర్‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలా సరైన సక్సెస్ కోసం అయ్యగారు దాదాపు పదేళ్ల పాటు యుద్ధం చేశాడు. ఈ సమయంలో 'లెనిన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అన్ని ప్రశ్నలకు సాలిడ్ సమాధానం ఇచ్చింది. గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అఖిల్ నెక్ట్స్ సినిమా ఏంటీ? అనేది హాట్ టాపిక్ మారింది.

Also Read
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..

బాక్సాఫీస్ వద్ద 'లెనిన్' దూకుడు
అక్కినేని అఖిల్ హీరోయిన్ గా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లెనిన్'. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను సినిమా బాగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ ఎపిసోడ్లు, అఖిల్ నటన సినిమాకు ప్లస్ పాయింట్ గా మారాయనే చెప్పాలి. ట్రేడ్ అంచనాల ప్రకారం.. గత నాలుగో రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.29.05 కోట్ల నెట్ అందుకోగా, రూ.33.37 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ ను అందుకుంది. ఇక ఓవర్సీస్‌లో దాదాపు రూ.8. కోట్లు అందుకున్నట్టు తెలుస్తోంది. దీంతో లెనిన్ ప్రపంచవ్యాప్తంగా రూ.41.42 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి.

Recommended For You
MIB Closing Collections: మా ఇంటి బంగారం క్లోజింగ్ కలెక్షన్లు.. సమంత మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
MIB Closing Collections: మా ఇంటి బంగారం క్లోజింగ్ కలెక్షన్లు.. సమంత మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
Akhil Akkineni Ends 10-Year Wait With Lenin

అఖిల్ ఇప్పటివరకు ఎక్కువగా లవ్ స్టోరీలు, క్లాస్ పాత్రల్లో కనిపించారు. ఈసారి పూర్తి స్థాయి మాస్ పాత్రను ఎంచుకోవడం ఆయన కెరీర్‌కు కీలకంగా మారింది. రగ్డ్ లుక్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో బీ, సీ సెంటర్లలో సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. విజయోత్సవ వేడుకల్లో నాగార్జున, అఖిల్ ఇద్దరూ భావోద్వేగానికి లోనవడం కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇలా దాదాపు 10ఏళ్ల నిరీక్షణకు ఈ విజయంతో బ్రేక్ పడినట్టు అయ్యింది.

You May Also Like
వారణాసిలో నందమూరి వారసుడు.. రాజమౌళి ప్లానింగ్ వేరే లెవల్..
వారణాసిలో నందమూరి వారసుడు.. రాజమౌళి ప్లానింగ్ వేరే లెవల్..

ఇక నెక్స్ట్ టార్గెట్.. మరో మాస్ యాక్షన్ మూవీ?
'లెనిన్' భారీ విజయం అందుకోవడంతో అఖిల్ తదుపరి ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సినీ వర్గాల ప్రకారం.. ప్రస్తుతం అఖిల్ రెండు సోర్టీలను పరిశీలిస్తున్నారట. వాటిలో ఒకదానిని త్వరలో ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అలా.. దర్శకుడు అనిల్ కుమార్‌తో అఖిల్ తదుపరి సినిమా ఉండొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో సినిమా చేస్తున్న అనిల్ కుమార్, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అఖిల్ మూవీని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

Mrunal Thakur: ధనుష్‌తో బ్రేకప్.. క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్?
Mrunal Thakur: ధనుష్‌తో బ్రేకప్.. క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్?

అనిల్ కుమార్ గతంలో దర్శకుడు సుజీత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కమర్షియల్ యాక్షన్ సినిమాలపై మంచి పట్టు ఉన్న ఆయన, అఖిల్ కోసం కూడా రగ్డ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'లెనిన్'తో వచ్చిన మాస్ ఇమేజ్‌ను కొనసాగించేలా ఈ సినిమా ఉండొచ్చని భావిస్తున్నారు. అఖిల్ కూడా ఇప్పుడు యాక్షన్ ప్రధాన పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి పెరిగింది.

ఓ ఇంటి వారైన శృతి హాసన్.. కొత్త జీవితానికి కమల్ కూతురు శ్రీకారం..
ఓ ఇంటి వారైన శృతి హాసన్.. కొత్త జీవితానికి కమల్ కూతురు శ్రీకారం..

మల్టీస్టారర్‌పై కూడా చర్చ
మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనున్న ఓ భారీ మల్టీస్టారర్‌లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురు కలిసి నటించే అవకాశముందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తపై అధికారిక ధృవీకరణ లేకపోయినా, అభిమానుల్లో మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఇక 'లెనిన్' ప్రమోషన్ల సమయంలోనే అఖిల్ అభిమానులకు ఓ హామీ ఇచ్చారు. ఇకపై సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండదని, వరుసగా కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అఖిల్ ఎలాంటి సినిమాతో ముందుకు వస్తారో? ఎలాంటి జోనర్ సినిమాను ఎంచుకుంటారో వేచి చూడాలి.

Read more about: akhil akkineni nagarjuna lenin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X