అట్లీ 18 ఏళ్ల కలల ప్రాజెక్ట్.. రాకా లో మరో హీరోయిన్ ఫిక్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్-వరల్డ్ మూవీ 'రాకా'. ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలను పెరుగుతున్నాయి. సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించగా, ఇప్పుడు మరో కీలక పాత్రలో ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నారంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?

Also Read
రామ్ చరణ్-ఉపాసనల డ్రీమ్ ఫామ్‌హౌస్.. ప్రత్యేకతలు ఏంటంటే..!
రామ్ చరణ్-ఉపాసనల డ్రీమ్ ఫామ్‌హౌస్.. ప్రత్యేకతలు ఏంటంటే..!

'రాకా'లో నైలా గ్రేవల్ గ్రాండ్ ఎంట్రీ
ఈ లక్కీ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్‌ హీరోయిన్ నైలా గ్రేవల్.. ఈ అమ్మడు 2015లో తమాషా సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తరువాత బరేలీ కి బర్ఫీ, థప్పడ్, ఇష్క్ విష్క్ రీబౌండ్ నటించి మెప్పించింది. ఇటీవల మామ్లా లీగల్ హై అనే సిరీస్ లో కూడా మెరిసింది. దాదాపు 11 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్న నైలా గ్రేవల్.. ఇప్పుడు తొలిసారి సౌత్ ఫిల్మీ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఆమెకు ఈ అవకాశం రావడం కూడా సాధారణ విషయం కాదని చెప్పాలి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా'లో భాగం కావడం తన కెరీర్‌లోనే ఒక ప్రత్యేక మైలురాయి అని నైలా పేర్కొంది.

Recommended For You
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..
రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు.. టాలీవుడ్ స్టార్స్‌పై వేణు స్వామి జోస్యం..
Allu Arjun s Raaka Adds Naila Grrewal

ఇటీవల హీరోయిన్ నైలా గ్రేవల్ ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నాను. మొదటిసారి ఆయనను కలిసినప్పుడే ఆయనతో కలిసి పనిచేయాలనే నా కోరికను చెప్పాను. నేను ఇప్పటివరకు హిందీ చిత్రాల్లో మాత్రమే నటించినప్పటికీ, నన్ను నమ్మి ఇలాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అవకాశం ఇవ్వడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం'అంటూ ప్రశంసలు కురిపించింది.

You May Also Like
10 ఏళ్ల నిరీక్షణకు లెనిన్‌తో తెర.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటి?
10 ఏళ్ల నిరీక్షణకు లెనిన్‌తో తెర.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటి?

అట్లీ 18 ఏళ్ల కల
నైలా గ్రేవల్ చెప్పిన మరో విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 'రాకా' కథను అట్లీ దాదాపు 18 ఏళ్లుగా తన మనసులో మోస్తున్నారని ఆమె వెల్లడించింది. 'ఇది సాధారణ సినిమా కాదు. ఎన్నో సంవత్సరాలుగా అట్లీ సర్ ఊహించిన ప్రపంచాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. సినిమా నిర్మాణం నుంచి పాత్రల రూపకల్పన వరకు ప్రతి అంశంలో కొత్తదనం ఉంటుంది. సాధారణ సినిమాలకు భిన్నంగా ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని ప్రపంచాన్ని ఆయన సృష్టిస్తున్నారు"అంటూ రాకా సినిమాపై హైప్స్ క్రియేట్ చేసింది.

తాళి కడుతా! అంటూ రెచ్చిపోయిన జబర్దస్త్ అవినాష్.. మంగళ సూత్రంతో యాంకర్‌కు చుక్కలు!
తాళి కడుతా! అంటూ రెచ్చిపోయిన జబర్దస్త్ అవినాష్.. మంగళ సూత్రంతో యాంకర్‌కు చుక్కలు!

అల్లు అర్జున్ అంకితభావం
'రాకా'షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి పని చేయడంపై నైలా ఆసక్తికర కామెంట్స్ చేసింది. "అల్లు అర్జున్ సెట్స్‌లో చూపించే ఫోకస్ అసాధారణం. ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించినా, ప్రతి సన్నివేశాన్ని మొదటిసారి చేస్తున్నట్టే చాలా శ్రద్ధతో చేస్తారు. పాత్ర కోసం ఆయన చూపించే ఏకాగ్రత కొత్త నటులకు పెద్ద స్ఫూర్తి. ఆయనలో ఇంకా నేర్చుకోవాలనే తపన స్పష్టంగా కనిపిస్తుంది" అంటూ ప్రశంసలు కురిపించింది.

Mrunal Thakur: ధనుష్‌తో బ్రేకప్.. క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్?
Mrunal Thakur: ధనుష్‌తో బ్రేకప్.. క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్?

'రాకా'లో పలువురు హీరోయిన్లు?
ఇప్పటికే ఈ సినిమాలో పలువురు హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపించినా, వాటిపై మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే మలయాళ నటి ఫెమినా జార్జ్ తాను కూడా సినిమాలో భాగమని ఇప్పటికే ప్రకటించింది.

OTT Releases This Week: మా ఇంటి బంగారం డిజిటల్ ఎంట్రీ.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: మా ఇంటి బంగారం డిజిటల్ ఎంట్రీ.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!

ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ నైలా గ్రేవల్ .. తన పాత్రను అధికారికంగా వెల్లడించడంతో 'రాకా'లో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారనే ఆసక్తి నెలకొంది. భారీ సాంకేతిక విలువలు, స్టార్ క్యాస్టింగ్, అట్లీ విజన్ కారణంగా ఈ సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న 'రాకా'పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Read more about: atlee allu arjun Raaka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X