Chennai Love Story Overseas Box Office: ఓవర్సీస్‌లో చెన్నై లవ్ స్టోరీ ర్యాంపేజ్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

యువ హీరో కిరణ్ అబ్బవరం, యువ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మించారు. సహ నిర్మాతగా ధీరజ్ మొగిలినేని వ్యవహరించారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: మణిశర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రవి నంబూరి, కథ: సాయి రాజేశ్, సినిమాటోగ్రఫి: విశ్వాస్ డేనియల్, ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్, లిరిక్స్: అనంత శ్రీరాం తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఓవర్సీస్‌లో ఈ మూవీ వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Also Read
Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ
Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ
Chennai Love Story Overseas Box Office Report

లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 15 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర వాల్యూ కట్టడం జరిగింది. ఓవర్సీస్ రైట్స్‌ను 5 కోట్లుగా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా దాదాపు 35 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 15 కోట్ల రూపాయల షేర్, 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేట్రికల్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Recommended For You
'నా శరీరం మరో మగాడిని కోరుకొన్నది.. అందుకే నాలుగో ప్రియుడిని వదిలేశాను’
'నా శరీరం మరో మగాడిని కోరుకొన్నది.. అందుకే నాలుగో ప్రియుడిని వదిలేశాను’

ఓవర్సీస్‌లో చెన్నై లవ్ స్టోరీ చిత్రం 5 కోట్ల షేర్, 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాపై క్రేజ్ ఉండటంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. అయితే జన నాయగన్ సినిమాతో పోటీపడుతూ రిలీజైన ఈ చిత్రం తాజాగా థియేటర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకొంటూ పోతున్నది. జన నాయగన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు తుడిచిపెట్టుకుపోవడంతో ఆ థియేటర్ల స్థానంలో ఈ సినిమాను రిప్లేస్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

You May Also Like
Srinivasa Mangapuram First Review: శ్రీనివాస మంగాపురం మూవీ ఫస్ట్ రివ్యూ
Srinivasa Mangapuram First Review: శ్రీనివాస మంగాపురం మూవీ ఫస్ట్ రివ్యూ

నార్త్ అమెరికా అంటే యూఎస్ఏ, కెనడాలో ఈ సినిమాకు భారీ ఆదరణ దక్కుతున్నది. ప్రీమియర్లతో కలిపి ఈ చిత్రం గత రెండు రోజుల్లో 300K డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 3 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఆదివారం సెలవు దినం రోజున ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ చిత్రం రానున్న రోజుల్లో భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

చిన్న పెగ్గు వేస్తే చిరంజీవిని.. పెద్ద పెగ్గు వేస్తే పవన్ కల్యాణ్‌ను.. రాంగోపాల్ వర్మకు Hyper aadi వార్నింగ్
చిన్న పెగ్గు వేస్తే చిరంజీవిని.. పెద్ద పెగ్గు వేస్తే పవన్ కల్యాణ్‌ను.. రాంగోపాల్ వర్మకు Hyper aadi వార్నింగ్

నార్త్ అమెరికాతోపాటు ఈ సినిమా ఇతర దేశాల్లో కూడా ఆదరణను సొంతం చేసుకొంటున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు నార్త్ అమెరికాతో కలిపి 5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో కిరణ్ అబ్బవరం సినిమాలకు ఉన్న ఫాలోయింగ్‌ను మరోసారి చెప్పింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X