Chennai Love Story Day 1 Box Office: చెన్నై లవ్ స్టోరీ మూవీకి భారీ ఒపెనింగ్స్.. కిరణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ చిత్రాలతో కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటున్న యువ హీరో కిరణ్ అబ్బవరం, యువ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మించారు. సహ నిర్మాతగా ధీరజ్ మొగిలినేని వ్యవహరించారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: మణిశర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రవి నంబూరి, కథ: సాయి రాజేశ్, సినిమాటోగ్రఫి: విశ్వాస్ డేనియల్, ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్, లిరిక్స్: అనంత శ్రీరాం తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూలై 24వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా ప్రీమియర్ షోల కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం తొలి రోజు వసూళ్ల అంచనా ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 15 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర వాల్యూ కట్టడం జరిగింది. దాంతో ఈ సినిమా దాదాపు 35 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 15 కోట్ల రూపాయల షేర్, 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేట్రికల్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
నిర్మాత, దర్శకులకు ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఒక రోజు ముందే అంటే.. జూలై 23వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోను, కర్ణాటకలోను ప్రీమియర్లు ప్రదర్శించారు. దాదాపు 85 లోకేషన్లలో 30 పట్టణాల్లో 90 స్క్రీన్లలో మొత్తంగా 125 ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా దాదాపు 70 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో 40 లక్షలు, ఆంధ్రాలో 20 లక్షలు, కర్ణాటకలో 8 లక్షల రూపాయలు వసూలు చేసింది అని తెలిపారు.
ప్రీమియర్ల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన స్పందన కనిపించింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఈ మూవీని దాదాపు ఆంధ్రా, నైజాం, కర్ణాటక, తమిళనాడు కలిపి 9 రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. మొత్తం 250 పట్టణాల్లో 450 లోకేషన్లలో 500 స్క్రీన్లలో 750 షోలు ప్రదర్శిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కడపటి వార్తలు అందే సరికి ఈ సినిమా 1 లక్ష టికెట్లు అమ్ముడుపోయాయి.
నార్త్ అమెరికాలో ఈ సినిమా మంచి రెస్సాన్స్ కనిపిస్తున్నది. ఈ మూవీని సుమారుగా 350కి పైగా లొకేషన్లలో రిలీజ్ చేశారు. టికెట్ రేట్లు పెంచకుండా సాధారణ రేట్లకు ఈ సినిమాను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 100K డాలర్లు అంటే 1 కోటి రూపాయలు వసూలు చేసింది.
ఇక ఈ సినిమా తొలి రోజు రికార్డు లెవెల్ కాకపోయినా.. బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం తొలి రోజు ప్రీమియర్లతో కలిపి ఈ చిత్రం 5 నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పరిస్థితులన్నీ అనుకూలించి.. నైట్ షోలకు డిమాండ్ పెరిగితే.. ఈ కలెక్షన్ల రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications



