Jana Nayagan AP, TG Collections: జన నాయగన్‌కు భారీ కలెక్షన్లు.. డిజాస్టర్ టాక్‌తో విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ టాక్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ సినిమా అంచనాలు మించి కలెక్షన్లను సాధిస్తున్నది. పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్ నటించిన ఈ సినిమా జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, దక్షిణాదిలో ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీని వెంకట్ కే నారాయణ నిర్మించారు. ఈ చిత్రం తొలి వారాంతంలో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించింది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

భగవంత్ కేసరి కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కథను తమిళ ప్రేక్షకులు, రాజకీయ నేపథ్యానికి అనుగుణంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్ పేలవంగా ఉండటంతో యూత్, క్రిటిక్స్ పెదవి విరిచారు. కానీ ఈ సినిమాను సాధారణ ప్రేక్షకుల ఆదరిస్తున్నారనే విషయం తాజా కలెక్షన్లతో స్పష్టమైంది.

Jana Nayagan Andhra Box Office Collections

జన నాయగన్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రిలీజ్ చేశారు. ఈ సినిమాను రికార్డు స్క్రీన్లలో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని కమీషన్ బేస్ మీద రిలీజ్ చేశారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 11 కోట్ల రూపాయల మేర నిర్ణయించారు. దాంతో ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణలో 11 కోట్ల షేర్, 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
'నా శరీరం మరో మగాడిని కోరుకొన్నది.. అందుకే నాలుగో ప్రియుడిని వదిలేశాను’
'నా శరీరం మరో మగాడిని కోరుకొన్నది.. అందుకే నాలుగో ప్రియుడిని వదిలేశాను’

ఈ సినిమా ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం తొలి రోజున 4.25 కోట్లు, రెండో రోజున 2 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2.05 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 4 రోజుల్లో ఈ సినిమా 10.4 కోట్ల రూపాయల నెట్, 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను నమోదు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.

Recommended For You
Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ
Spider Man: Brand New Day First Review: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఫస్ట్ రివ్యూ

ఈ సినిమా రిలీజ్ తర్వాత టాక్ సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. నైజాంలో ఈ చిత్రం 3.25 కోట్లు, ఆంధ్రాలో ఈ చిత్రం 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. ఇంకా కనీసం 6 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని తెలిపారు.

You May Also Like
Spider Man Box Office Collections: స్పైడర్ మ్యాన్ బాక్సాఫీస్ సునామీ.. అడ్వాన్స్ బుకింగ్‌తో రికార్డుల సెన్సేషన్
Spider Man Box Office Collections: స్పైడర్ మ్యాన్ బాక్సాఫీస్ సునామీ.. అడ్వాన్స్ బుకింగ్‌తో రికార్డుల సెన్సేషన్

జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి ప్రధాన పాత్రల్లో తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X