Jana Nayagan Day 2 Collections: 100 కోట్లతో జన నాయగన్ సంచలనం.. విజయ్ మూవీ రికార్డుల మోత
తమిళనాడు సీఎం, దళపతి విజయ్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రను పోషించగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి ప్రధాన పాత్రల్లో తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఈ చిత్రం తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనే వివరాల్లోకి వెళితే..

భగవంత్ కేసరి సినిమా ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి తమిళ నేటివిటికి అనుగుణంగా భారీ మార్పులు చేపట్టారు. ఈ మూవీని సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ కమీషన్ బేస్ మీద ఇతర డిస్టిబ్యూటర్ల ద్వారా సొంతంగా రిలీజ్ చేసుకొన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ చిత్రం తమిళనాడు థియేట్రికల్ బిజినెస్‌ను 105 కోట్లుగా, ఇతర ప్రాంతాల్లో 95 కోట్లుగా వాల్యూ కట్టారు. దాదాపు ఈ చిత్రం 200 కోట్ల షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మూవీ రావడంతో భారీ క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో 12000 షోలు ప్రదర్శించారు. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఈ సినిమా తమిళనాడులో 80 శాతం ఆక్యుపెన్సీతో భారీ వసూళ్లు సాధించింది.
ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 24 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, కర్ణాటకలో 11.5 కోట్లు, కేరళలో 5.5 కోట్లు, హిందీలో 2 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం 41 కోట్ల రూపాయల నెట్, 49 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి, యూకే, గల్ఫ్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియాలో రికార్డు స్థాయి కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది. దాంతోఈ చిత్రం 30 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంత ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 78 కోట్లకుపైగా కలెక్షన్లను తొలి రోజు నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు షాకింగ్‌గా ఉన్నాయి. తొలి రోజు కంటే 2వ రోజు భారీగా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ చిత్రం రెండో రోజు వరల్డ్ వైడ్‌గా 15 నుంచి 20 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications



