Jana Nayagan Day 3 Collections: బాక్సాఫీస్ కింగ్ జన నాయగన్.. సీఎం విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Jana Nayagan Box Office Collections: తమిళనాడు సీఎం దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈసినిమాలో మమితా బైజు కీలక పాత్ర పోషించగా, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ సినిమా సుదీర్ఘంగా 7 నెలల సెన్సార్ అడ్డంకులను ఎదుర్కొని జూలై 23న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? ఇప్పటి వరకూ ఎంత కలెక్ట్ చేసింది? మూడో రోజు అంచనా కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Also Read
కింగ్ నాగార్జున సీక్రెట్ లీక్ చేసిన నాగచైతన్య.. ఆ విషయం అఖిల్ కూడా తెలుసంటా.
కింగ్ నాగార్జున సీక్రెట్ లీక్ చేసిన నాగచైతన్య.. ఆ విషయం అఖిల్ కూడా తెలుసంటా.

తెలుగులో భారీ విజయం సాధించిన 'భగవంత్ కేసరి' సినిమా ఆధారంగా తీసుకుని, తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథ, పాత్రలు, స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసి, 'జన నాయగన్'ను రూపొందించారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. భారీ అంచనాలు నెలకొన్న సినిమా బిజినెస్ కూడా భారీ మొత్తం జరిగినట్టు తెలుస్తోంది.

Recommended For You
ఆఫర్ల కోసం నిర్మాత, దర్శకులతో పడుకో.. భార్యపై అమీర్ ఖాన్ సోదరుడి ఒత్తిడి..
ఆఫర్ల కోసం నిర్మాత, దర్శకులతో పడుకో.. భార్యపై అమీర్ ఖాన్ సోదరుడి ఒత్తిడి..
jana nayagan day 3 expected box office collections worldwide vijay movie racing towards 150 crores

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. తమిళనాడులో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విలువ సుమారు 105 కోట్లు, మిగతా ప్రాంతాల్లో దాదాపు 95 కోట్ల రూపాయలుగా నమోదైంది. దీంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్ సుమారు 200 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే.. ఈ సినిమా సుమారు 200 కోట్ల షేర్, దాదాపు 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేయాల్సి ఉంటుంది.

You May Also Like
జాన్వీ.. నీ బ్యూటీ స్పాట్స్ చూపిస్తావా? హీరో మెసేజ్‌‌కు బ్యూటీ రియాక్షన్ ఏమిటంటే?
జాన్వీ.. నీ బ్యూటీ స్పాట్స్ చూపిస్తావా? హీరో మెసేజ్‌‌కు బ్యూటీ రియాక్షన్ ఏమిటంటే?

తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మూవీ రావడంతో భారీ క్రేజ్ ఏర్పడింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో 12000 షోలు ప్రదర్శించారు. దీంతో తొలిరోజు ఎవరూ ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా 85.04 కోట్ల రూపాయల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇందులో తమిళనాడులో 24 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, కర్ణాటకలో 11.5 కోట్లు, కేరళలో 5.5 కోట్లు, హిందీలో 2 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ఇలా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తొలి రోజు 42. 70కోట్ల రూపాయల నెట్, 49 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ లో కూడా భారీ మొత్తంతో వసూలు చేసింది. నార్త్ అమెరికా. యూకే, గల్ఫ్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియాలో రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసింది. ఈ లెక్కన ఈ సినిమా ఓవర్సీర్ లో తొలిరోజు 30 కోట్ల రూపాయలను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా.

’చిన్న పెగ్ వేస్తే చిరంజీవిని.. పెద్ద పెగ్‌తో పవన్ కల్యాణ్‌ను టార్గెట్’
ఇదిలా ఉండగా, రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు షాకింగ్‌గా ఉన్నాయి. శుక్రవారం 'జన నాయకుడు' సినిమా దేశవ్యాప్తంగా సుమారు 12,190 షోల ద్వారా కేవలం 21.15 కోట్ల రూపాయాల నెట్ కలెక్షన్లు సాధించింది. తొలి రోజు నమోదైన 42.70 కోట్ల రూపాయాల నెట్ వసూళ్లతో పోలిస్తే దాదాపు 50.50 శాతం తగ్గుదల. వీకెండ్‌కు ముందు ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలు కాస్త షాకింగ్ గా మారింది.

ఇక ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 63.85 కోట్ల రూపాయాల నెట్, 75 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసిందట. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో రెండో రోజు మరో 10 కోట్ల రూపాయాల వసూలు చేయడంతో, రెండు రోజుల ఓవర్సీస్ గ్రాస్ 37.50 కోట్ల రూపాయాలకు చేరిందట. దీంతో ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు రోజుల్లోనే 'జన నాయగన్' 112.50 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే మరోవైపు.. జననాయగన్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు మూవీ నిర్మాతలు ప్రకటించడం గమన్హారం.

బిగ్ బాస్‌లోకి సౌరవ్ గంగూలీ.. దాదా పారితోషికం ఎన్ని కోట్లంటే?
బిగ్ బాస్‌లోకి సౌరవ్ గంగూలీ.. దాదా పారితోషికం ఎన్ని కోట్లంటే?

మూడో రోజు 'జన నాయగన్' జోరు..
ఇక వీకెండ్ ఎఫెక్ట్‌తో జననాయగన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మొదటి రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా, మూడో రోజు (శనివారం) కూడా అదే జోరును కొనసాగిస్తోంది. సెలవు రోజు కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన సెంటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ట్రేడ్ వర్గాల (సాక్‌నిక్) ప్రకారం, శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు దేశవ్యాప్తంగా 5,967 షోల ద్వారా ఈ సినిమా 6.03 కోట్ల రూపాయాల నెట్ కలెక్షన్లు అందుకున్నట్టు తెలుస్తోంది.

పోయి డాక్టర్‌కి చూపించుకో... నెటిజన్‌కి తనూజ దిమ్మతిరిగేలా కౌంటర్..
పోయి డాక్టర్‌కి చూపించుకో... నెటిజన్‌కి తనూజ దిమ్మతిరిగేలా కౌంటర్..

ఈ ట్రెండ్ గమనిస్తే.. సాయంత్రం, రాత్రి షోల బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉండటంతో మూడో రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్క చూస్తే మూడో రోజు సుమారు 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేటీ అంచనాల బట్టి చూస్తే .. జననాయగన్ 150 కోట్ల క్లబ్ కు చేరువకానున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X