కింగ్ నాగార్జున సీక్రెట్ లీక్ చేసిన నాగచైతన్య.. ఆ విషయం అఖిల్ కూడా తెలుసంటా.

టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో సూపర్ హిట్స్ అందుకుని స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన తన కెరీర్ లో ఎన్నో డిఫెరెంట్ రోల్స్ పోషించి, తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తునే ఉన్నారు. లవర్ బాయ్, యాక్షన్ హీరో, రొమాంటిక్ హీరో, అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి లాంటి భక్తి రస సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగానే కాదు నిర్మతగాను సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు నాగార్జున. ఇటీవల విలన్ గా కూడా నటించి అదరగొట్టారు నాగ్. అలాంటి కింగ్ నాగ్ సీక్రెట్ ను హీరో నాగ చైతన్య బయటపెట్టారు. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
డైరెక్టర్ అనిల్ కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. రోజా, శ్రీకాంత్ ముందే రెచ్చిపోయాడుగా..
డైరెక్టర్ అనిల్ కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. రోజా, శ్రీకాంత్ ముందే రెచ్చిపోయాడుగా..

తాజాగా అక్కినేని అఖిల్ కెరీర్‌లో 'లెనిన్'ఓ మైల్ స్టోన్. ఎన్నాళ్లుగానో సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. కలెక్షన్లు పరంగా కూడా సక్సెస్ అందుకుంది. భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లెనిన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. తన తండ్రి, కింగ్ నాగార్జున ఇంట్లో ఏవిధంగా ఉంటారో.. తన నైజం ఎలా ఉంటుందో బయటపెట్టారు.

Recommended For You
ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'లో హీరోయిన్ ఫిక్స్? త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..
ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'లో హీరోయిన్ ఫిక్స్? త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..
Naga Chaitanya Reveals Nagarjuna s Secret at Lenin Success Meet

నాగార్జున గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. "కింగ్ నాగ్ ఫైర్ ఎవరికీ తెలీదు. ఇంట్లో ఆయన ఎలా ఉంటారో నాకు, అఖిల్‌కే తెలుసు. ఒకసారి ఏదైనా ఛాలెంజ్ తీసుకుంటే వెనక్కి తగ్గరు. అది ఆయన గొప్ప లక్షణం" అని అన్నారు. 'బంగార్రాజు' సినిమా సమయంలో చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేశారని గుర్తు చేశారు. ఆ సినిమాను 6 నెలల్లో పూర్తి చేశారు. సంక్రాంతికి రిలీజ్ చేసి, అది హిట్ కొట్టారని తెలిపారు. అదే పట్టుదల 'లెనిన్' సినిమా విషయంలో కూడా కనిపించిందని చెప్పారు.

You May Also Like
Ramayana Trailer Review: 'రామాయణ' ట్రైలర్‌పై అట్లీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవిపై కామెంట్స్!
Ramayana Trailer Review: 'రామాయణ' ట్రైలర్‌పై అట్లీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవిపై కామెంట్స్!

'లెనిన్' కథ విన్న తర్వాత తాను కూడా సందేహపడ్డానని నాగచైతన్య వెల్లడించారు. "ఈ కథ చాలా పెద్దది. పాత్ర కూడా చాలా క్లిష్టంగా అనిపించింది. కాంప్లెక్స్ లవ్ స్టోరీ, చాలా అన్యూజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి , ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు చేయడం సరైన నిర్ణయమేనా అని నాన్నను అడిగాను. కానీ ఆయన మాత్రం 'నేను చేసి చూపిస్తా' అని ఒక్క మాట చెప్పారు. అదే నాకు అదే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ " అని అన్నారు.
నాగార్జున కెరీర్‌లో వచ్చిన 'శివ', 'గీతాంజలి', 'అన్నమయ్య', 'నిన్నే పెళ్లాడతా' వంటి చిత్రాలు కూడా ఇలాంటి సాహసోపేత నిర్ణయాల ఫలితమేనని చైతన్య చెప్పారు. కొత్త కథలను నమ్మి ముందుకు వెళ్లే ధైర్యమే నాగార్జునను ప్రత్యేకంగా నిలబెట్టిందని ప్రశంసించారు.

Lenin 11 Days BoxOffice: అఖిల్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేక్‌.. లెనిన్‌ మూవీకి ఎన్ని కోట్లంటే ?
Lenin 11 Days BoxOffice: అఖిల్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేక్‌.. లెనిన్‌ మూవీకి ఎన్ని కోట్లంటే ?

అఖిల్ గురించి మాట్లాడుతూ నాగచైతన్య ప్రశంసల వర్షం కురిపించారు. "ఈ కథను ఒప్పుకున్న రోజే అఖిల్ నా దృష్టిలో హీరో అయ్యాడు. కథ విన్న వెంటనే నాకు భయం వేసింది. ఇలాంటి పాత్ర చేయాలంటే చాలా అనుభవం అవసరం. కానీ అఖిల్ మాత్రం కథను నమ్మి ముందుకు వెళ్లాడు. సినిమా కోసం అతడు ఎంత కష్టపడ్డాడో నేను దగ్గర నుంచి చూశాను. ఒక అన్నయ్యగా, అభిమానిగా అతడిని చూసి గర్వపడుతున్నాను" అని అన్నారు.

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు.. రామ్ చరణ్ 'పెద్ది' సత్తా.. టాప్‌లో 'ధురంధర్'!
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు.. రామ్ చరణ్ 'పెద్ది' సత్తా.. టాప్‌లో 'ధురంధర్'!

నిర్మాత నాగవంశీ గురించి కూడా చైతన్య ఆసక్తికరంగా మాట్లాడారు. 'ప్రేమమ్' రోజులలో చాలా సైలెంట్‌గా ఉండే వంశీ.. ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారని అన్నారు. "ఒక హీరోను ఎలా ప్రెజెంట్ చేయాలో వంశీకి బాగా తెలుసు. అదే అఖిల్‌కు కూడా ఉపయోగపడింది. అందుకు అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు" అని చెప్పారు. దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరిని కూడా నాగచైతన్య అభినందించారు. 'సవ్యసాచి' సినిమా సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, ఇప్పుడు దర్శకుడిగా సక్సెస్ మీట్ నిర్వహించే స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మొత్తం మీద నాగచైతన్య చేసిన ఎమోషనల్ స్పీచ్ 'లెనిన్' సక్సెస్ మీట్‌లో హైలెట్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X