బిగ్ బాస్‌లోకి సౌరవ్ గంగూలీ.. దాదా పారితోషికం ఎన్ని కోట్లంటే?

ఇండియాలో అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. హిందీతో ప్రారంభమైన ఈ షో.. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ సహా పలు భాషల్లో సక్సెస్ పుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అన్ని భాషల్లోనూ ఈ షోకు సినీ నటులే హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే ఈసారి ఆ సంప్రదాయానికి భిన్నంగా ఓ మాజీ క్రికెటర్ హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. బెంగాలీ బిగ్ బాస్ సీజన్-3కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. క్రికెట్ మైదానంలో భారత జట్టును ముందుండి నడిపించిన గంగూలీ.. ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి స్పందన రావడంతో ఈ షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read
Jana Nayagan Day 1 AP TG Collections: జన నాయగన్ కలెక్షన్స్.. ఆంధ్రా, నైజాంలలో తొలిరోజు ఎన్ని కోట్లంటే?
Jana Nayagan Day 1 AP TG Collections: జన నాయగన్ కలెక్షన్స్.. ఆంధ్రా, నైజాంలలో తొలిరోజు ఎన్ని కోట్లంటే?

ఒకేసారి ఆరు భాషల్లో బిగ్ బాస్
ఈసారి బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి ఆరు భాషల్లో కొత్త సీజన్లు ప్రారంభం కానున్నాయి. జియోస్టార్ అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం సెప్టెంబర్‌లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్లు ప్రారంభం కానున్నాయి.
హిందీ బిగ్ బాస్‌కు ఎప్పటిలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా కొనసాగుతుండగా, తెలుగు బిగ్ బాస్‌కు అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా కనిపించనున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్‌లాల్ తమ తమ సీజన్లకు హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ఇక బెంగాలీ బిగ్ బాస్ సీజన్-3కు తొలిసారిగా మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టానున్నారు.

Recommended For You
బిగ్ సర్‌ప్రైజ్.. ప్రియాంక పాత్రపై రాజమౌళి క్లారిటీ.. అంచనాలు పెంచేశారుగా!
బిగ్ సర్‌ప్రైజ్.. ప్రియాంక పాత్రపై రాజమౌళి క్లారిటీ.. అంచనాలు పెంచేశారుగా!
Sourav Ganguly to Host Bigg Boss Bangla Season 3

10 ఏళ్ల తర్వాత బెంగాలీ బిగ్ బాస్ రీఎంట్రీ
బెంగాలీ బిగ్ బాస్ రెండో సీజన్ ముగిసిన దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మూడో సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి షోను మరింత గ్రాండ్‌గా తిరిగి తీసుకురావాలని నిర్వాహకులు నిర్ణయించారు. అందుకే బెంగాల్‌లో అపారమైన అభిమానులను కలిగిన సౌరవ్ గంగూలీని హోస్ట్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయమైన అంశం గంగూలీ పారితోషికం. వివిధ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఒక్క సీజన్‌కు ఆయనకు సుమారు రూ.125 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తాన్ని జియోస్టార్ లేదా గంగూలీ అధికారికంగా ధృవీకరించలేదు. ఇదినిజమైతే.. ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో అత్యధిక పారితోషికం అందుకున్న రియాలిటీ షో హోస్ట్‌లలో గంగూలీ ఒకరిగా నిలుస్తారు.

You May Also Like
Chennai Love Story Public Talk: చెన్నై లవ్ స్టోరీ పబ్లిక్ టాక్.. కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?
Chennai Love Story Public Talk: చెన్నై లవ్ స్టోరీ పబ్లిక్ టాక్.. కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

గంగూలీకి హోస్టింగ్ కొత్త కాదు
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి టెలివిజన్ ప్రపంచం కొత్త కాదు. గతంలో ఆయన నిర్వహించిన దాదాగిరి అన్‌లిమిటెడ్ క్విజ్ షో బెంగాల్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఆయన సెటైరికల్ కామెంట్స్, ఫన్నీ కామెంట్స్, పాల్గొనేవారితో మమేకమయ్యే తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే బిగ్ బాస్ వంటి భారీ రియాలిటీ షోను కూడా ఆయన విజయవంతంగా నడిపిస్తారనే నమ్మకం నిర్వాహకుల్లో కనిపిస్తోంది.

Chennai Love Story Twitter Review: చెన్నై లవ్ స్టోరీ ట్విట్టర్ రివ్యూ
Chennai Love Story Twitter Review: చెన్నై లవ్ స్టోరీ ట్విట్టర్ రివ్యూ

క్రికెట్ నుంచి రియాలిటీ షో వరకు
టీమిండియాను దూకుడుగా ముందుకు నడిపించిన కెప్టెన్‌గా గంగూలీ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. భారత క్రికెట్‌లో దూకుడు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఆయన.. ఇప్పుడు అదే నాయకత్వాన్ని బిగ్ బాస్ వేదికపై కూడా చూపిస్తారా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కంటెస్టెంట్ల మధ్య తలెత్తే వివాదాలను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు.

ఆ కల కోసం 8 ఏళ్ల పోరాటం.. 1000 ఇంజెక్షన్లు తీసుకున్న హీరోయిన్!
ఆ కల కోసం 8 ఏళ్ల పోరాటం.. 1000 ఇంజెక్షన్లు తీసుకున్న హీరోయిన్!

జియోస్టార్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2025లో బిగ్ బాస్ ఫ్రాంచైజీని అన్ని భాషల్లో కలిపి 50 కోట్లకు పైగా ప్రేక్షకులు వీక్షించారు. మొత్తం 438 బిలియన్ వ్యూయింగ్ నిమిషాలు, 9.32 బిలియన్ ఓట్లు, 43 మిలియన్ లైవ్ చాట్స్, 1.7 బిలియన్ సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్స్ నమోదయ్యాయి. ఈ గణాంకాలే బిగ్ బాస్ దేశవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపుతోందో తెలియజేస్తున్నాయి. ఇక బెంగాలీ బిగ్ బాస్‌కు సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా రావడం షోకు కొత్త గుర్తింపును తీసుకురానుంది. సెప్టెంబర్‌లో షో ప్రారంభమైన తర్వాత గంగూలీ హోస్టింగ్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X