Jilla Re Release Box Office: జిల్లా రీ రిలీజ్ కలెక్షన్స్.. సీఎం విజయ్ మూవీకి వసూళ్లు ఎంతంటే?

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ప్రతి వారం ఏదో ఒక పాత సినిమా 4కే వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రజలు కూడా పాత సినిమాలను అలాగే ఆదరిస్తుండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన హిట్ మూవీ జిల్లా 4కే వెర్షన్‌లో విడుదలైంది. దళపతి పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 19న తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్‌లోని కొన్ని ప్రాంతాల్లో పరిమితంగా ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో జిల్లా రీ రిలీజ్‌లో ఎంత వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Hanuman3D Box Office: హనుమాన్ 3డీ కలెక్షన్స్.. రీ రిలీజ్‌లో తేజా సజ్జా మూవీకి ఎంతంటే?
Hanuman3D Box Office: హనుమాన్ 3డీ కలెక్షన్స్.. రీ రిలీజ్‌లో తేజా సజ్జా మూవీకి ఎంతంటే?

జిల్లా తారాగణం
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్‌బీ చౌదరి ఈ జిల్లా చిత్రాన్ని నిర్మించగా.. ఆర్టీ నీసన్ దర్శకత్వం వహించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్ర పోషించగా.. విజయ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. సూరి, బ్రహ్మానందం, సంపత్ రాజ్, శ్రీరామ్, ప్రదీప్ రావత్, మహత్ రాఘవేంద్ర, నివేదా థామస్, పూర్ణిమ భాగ్యరాజ్, విద్యుల్లేఖ రామన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. డీ ఇమ్మాన్ సంగీతం అందించగా.. డాన్ మ్యాక్స్ ఎడిటింగ్, గణేష్ రాజావేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

Jilla Re-Release Collections Thalapathy Vijay and Mohanlal s film Box Office Report

జిల్లా ప్రీ రిలీజ్ బిజినెస్
విజయ్ క్రేజ్‌కి తోడు మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా వరల్డ్ వైడ్‌గా 37 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది జిల్లా. ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ను సన్‌ టీవీ ఏకంగా 16 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. జిల్లా మూవీ జనవరి 9, 2014న ఫ్రాన్స్, సింగపూర్, కెనడాలలో తొలుత రిలీజ్ అయ్యింది. జనవరి 10, 2014న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Recommended For You
14 ఏళ్లు ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరిని పెళ్లాడింది... షాకింగ్‌గా సుడిగాలి సుధీర్ బ్రేకప్‌ స్టోరీ
14 ఏళ్లు ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరిని పెళ్లాడింది... షాకింగ్‌గా సుడిగాలి సుధీర్ బ్రేకప్‌ స్టోరీ

జిల్లా టోటల్ కలెక్షన్స్
విజయ్ క్రేజ్ దృష్ట్యా తమిళనాడులో తొలి రోజున జిల్లాకు కోటి రూపాయల ఓపెనింగ్స్ రాగా... వరల్డ్ వైడ్‌గా 25 మిలియన్ డాలర్లు (2.5 కోట్ల రూపాయల) వసూలు చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసేసరికి జిల్లా మూవీ తమిళనాడులో 52.20 కోట్ల రూపాయలు, కేరళలో 8.75 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4.70 కోట్ల రూపాయలు, ఆంధ్రా- నైజాం 4.50 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 3.50 మిలియన్ డాలర్లు (21.60 కోట్ల రూపాయలు) చొప్పున వరల్డ్ వైడ్‌గా 92.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

You May Also Like
'ఇంకొకడిని తగులుకుని రోజూ అదే పని... నా భార్య వల్ల జీవితం నాశనం’
'ఇంకొకడిని తగులుకుని రోజూ అదే పని... నా భార్య వల్ల జీవితం నాశనం’

రీ రిలీజ్‌లో జిల్లా వసూళ్లు
విజయ్ సీఎం అయ్యాక వచ్చిన తొలి పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లా రీలీజైంది. జూన్ 19న ఈ మూవీ ప్రీ సేల్స్‌లో సత్తా చాటింది. అడ్వాన్స్ బుకింగ్‌లో తమిళనాడులో 7.76 లక్షల రూపాయలు, కర్ణాటకలో 1.26 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఇక తొలివారం దళపతి విజయ్ మూవీకి తమిళనాడులో 56 లక్షల రూపాయలు, కర్ణాటకలో 8.50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 64.50 లక్షల రూపాయలు వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. పరిమితంగానే రిలీజ్ అయినప్పటికీ విజయ్ క్రేజ్ దృష్ట్యా జిల్లాకు డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. మరి ఈ వీకెండ్‌లో జిల్లాకు 4కే వెర్షన్‌లో ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X