Lenin 11 Days BoxOffice: అఖిల్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేక్‌.. లెనిన్‌ మూవీకి ఎన్ని కోట్లంటే ?

Lenin Day 11 Box Office Collection: అక్కినేని అఖిల్ హీరోగా, మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'లెనిన్'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. విడుదలైన మొదటి రోజు మిక్స్‌డ్ టాక్‌ను ఎదుర్కొంది. అయితే కథ, భావోద్వేగాలు, అఖిల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండో రోజు నుంచే పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ రావడంతో సినిమా వసూళ్లు క్రమంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో లెనిన్ సినిమా తొలివారం ఏ మేరకు వసూళ్లను సాధించింది. రెండో వీకెండ్ బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఏమిటి? 11 రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? అనే వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ ఇంట్లో సంబరాలు.. కూతురు సితారపై మహేష్ ,నమ్రత ఎమోషనల్
'లెనిన్' సినిమాను సుమారు 55 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ వ్యయంతో పాటు ప్రచార ఖర్చులు, సాంకేతిక విభాగాల ఖర్చులు కూడా భారీగానే అయ్యాయి. అయితే సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, మ్యూజిక్ హక్కులు, ఇతర నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలకు మంచి ఆదాయం వచ్చినట్లు సమాచారం.

Lenin 11 days expected box office collections worldwide

దీంతో థియేట్రికల్ బిజినెస్‌పై ఉన్న ఒత్తిడి గణనీయంగా తగ్గింది. ఈ చిత్రం థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ లక్ష్యం సుమారు 24 కోట్ల రూపాయలుగా ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విడుదలైన తొలి వారంలోనే ఆ లక్ష్యాన్ని అధిగమించి సినిమా లాభాల బాట పట్టింది. ముఖ్యంగా నైజాం, సీడెడ్, ఆంధ్రతో పాటు పలు కీలక ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల్లోకి వెళ్లినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read
24 గంటల ఫుటేజ్‌ను గంటలో ఎలా చూపిస్తారు ? బిగ్ బాస్‌పై లేడీ కామెడియన్ షాకింగ్ కామెంట్స్..
24 గంటల ఫుటేజ్‌ను గంటలో ఎలా చూపిస్తారు ? బిగ్ బాస్‌పై లేడీ కామెడియన్ షాకింగ్ కామెంట్స్..

ఇక లెనిన్ కలెక్షన్ల పరంగా మొదటి వీకెండ్‌లోనే మంచి జోరు చూపించింది. విడుదలైన తొలి రోజు 7.15 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, రెండో రోజు 8.85 కోట్ల రూపాయలు, మూడో రోజు 9.90 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో కలెక్షన్లు కొంత తగ్గాయి. అయితే ఇది దాదాపు ప్రతి సినిమాకూ కనిపించే సాధారణ ట్రెండ్. నాలుగో రోజు సినిమా 3.60 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2.15 కోట్ల రూపాయలు, ఏడో రోజు 2 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. ఈ విధంగా తొలి వారం ముగిసే సమయానికి మొత్తం 36.65 కోట్ల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్లు నమోదు చేసింది.

Recommended For You
Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా 'లెనిన్' పూర్తిగా డౌన్ కాలేదు. ఎనిమిదో రోజు 1.65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, తొమ్మిదో రోజు 2.40 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టింది. వీకెండ్ కలెక్షన్లు ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 10వ రోజు ఒక్కరోజే 3. 22 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇది 9వ రోజు వచ్చిన 2. 40 కోట్ల రూపాయలతో పోలిస్తే దాదాపు 34.2 శాతం అధికం. ఇలా 10 రోజుల్లో 'లెనిన్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 43.92 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. అలాగే ఇండియన్ గ్రాస్ కలెక్షన్లు 50.40 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'లెనిన్'కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఓవర్సీస్‌లో ఈ చిత్రం 10.20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దేశీయ గ్రాస్‌తో కలిపి సినిమా ప్రపంచవ్యాప్తంగా 60.60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దీంతో 'లెనిన్' అధికారికంగా 60 కోట్ల రూపాయల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.

You May Also Like
OTT Releases This Week: ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ వారం మిస్ కాకూడని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ వారం మిస్ కాకూడని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

ఇక 11వ రోజు కూడా లెనిన్ తన బాక్సాఫీస్ ప్రయాణం కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 932 షోలలో 'లెనిన్' ప్రదర్శితమవుతోంది. ప్రారంభ అంచనాల ప్రకారం 11వ రోజు సుమారు 31 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు ఇప్పటికే నమోదు చేసింది. ఈ ట్రెండ్ ను గమనిస్తే.. సాయంత్రం, రాత్రి షోల కలెక్షన్లు కాస్త పెరిగే అవకాశముంది. ఈ లెక్కన 11 రోజు 2 కోట్ల రూపాయాల వరకు కలెక్షన్లు అందుకునే అవకాశముంది. దీంతో మొత్తం ఇండియన్ కలెక్షన్లు 46 కోట్ల రూపాయలకు, ఇండియన్ గ్రాస్ కలెక్షన్లు 50.77 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశముంది. ఇండియన్ గ్రాస్‌తో కలిపి సినిమా ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు దాచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X