OTT Releases This Week: ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ వారం మిస్ కాకూడని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండుగేనని చెప్పాలి. డిజిటల్ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల స్ట్రీమింగ్ కు సిద్దమయ్యాయి. జూలై 20 నుంచి 26 వరకు నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, జీ5, ఆపిల్ టీవీ ప్లస్, సన్ నెక్స్ట్ వంటి ప్రముఖ ఓటీటీ వేదికల్లో పలు కొత్త కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ వారం తెలుగు సినిమాలతో పాటు హిందీ, ఇంగ్లీష్, మలయాళం పలు సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రానున్నాయి.
ఇక థియేటర్ల విషయానికొస్తే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' ఈ గురువారం విడుదల కానుంది. తెలుగులో కిరణ్ అబ్బవరం నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే కాజల్ అగర్వాల్ నటించిన 'ది ఇండియా స్టోరీ', 'హే చికితా', 'చంద్రప్పన్', 'కాగితం పడవలు' వంటి చిన్న చిత్రాలు కూడా విడుదల కాకున్నాయి. ఈ సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఈ వారం తెలుగు ప్రేక్షకులకు కొంత ఆసక్తి కలిగిస్తున్న కంటెంట్‌లో 'ముసాఫిర్ కేఫ్' ఒకటి. విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ హిందీ రొమాంటిక్ డ్రామా సిరీస్, ప్రముఖ రచయిత దివ్య ప్రకాశ్ దూబే నవల ఆధారంగా రూపొందింది. ప్రేమ, జీవిత లక్ష్యాలు, భావోద్వేగాలతో కూడిన కథగా ఇది రూపొందింది. తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులోకి రానున్నది.
'ఆదర్శ్ బాల్ విద్యాలయ'
అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' జూలై 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేకే మీనన్, నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రభుత్వ పాఠశాల నేపథ్యంలో సాగుతుంది. ఒక సాధారణ పాఠశాలను మార్చేందుకు ప్రయత్నించే ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల బృందం ఎదుర్కొనే సవాళ్లే ఈ కథలో ప్రధానాంశం. తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
సోనీలివ్‌లో 'పల్లిచట్టంబి'
మలయాళ స్టార్ టోవినో థామస్ నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'పల్లిచట్టంబి'. ఈ మూవీ జూలై 24 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు డబ్బింగ్‌లో కూడా ఈ చిత్రం విడుదల కానున్నంది. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
జియోహాట్‌స్టార్‌లో
జియోహాట్‌స్టార్‌లో 'స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్' అనే హాలీవుడ్ సిరీస్ జూలై 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ కామెడీ సిరీస్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' అభిమానులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యానిమే 'బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ - ఫైనల్ సీజన్' జూలై 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యానిమే అభిమానులకు ఇది ప్రధాన ఆకర్షణ.
జీ5లో మరాఠీ సిరీస్ 'అగ ఆయ్ అహో ఆయ్', బెంగాలీ సిరీస్ 'ప్రేమ్ షాట్స్' జూలై 24న విడుదల కానున్నాయి. లయన్స్‌గేట్ ప్లేలో 'ప్రొటెక్టర్' అనే ఇంగ్లీష్ మూవీ, ఆపిల్ టీవీ ప్లస్‌లో 'ది డింక్', సన్ నెక్స్ట్‌లో మలయాళ చిత్రం 'సీక్రెట్ ఆఫ్ కళింగ' కూడా అదే రోజు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో సందడి
ఈ వారం ఎక్కువ కంటెంట్ విడుదల చేస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. జూలై 22న 'ఏ టాక్సిక్ లవ్ స్టోరీ' అనే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీతో పాటు 'ఎలైట్ ఫోర్స్' అనే ఫ్రెంచ్ యాక్షన్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. జూలై 23న 'రాన్సమ్ క్యానియన్ సీజన్ 2', 'ది డెట్ కలెక్టర్' విడుదల కానున్నాయి. జూలై 24న మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో వరుస రిలీజ్‌లు ఉన్నాయి. 'ది ట్రూతర్స్', '72 అవర్స్', 'లాస్ క్రెయంటస్'తో పాటు తెలుగు డబ్బింగ్‌లో 'ముసాఫిర్ కేఫ్'కూడా అందుబాటులోకి రానుంది. అలాగే 'కాన్ సిటీ' అదే రోజు స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications




