Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

Bigg Boss Telugu 10: తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ అందుకుంటున్న రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే సక్సెస్‌పుల్‌గా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ రియాలిటీ షో ఇప్పుడు ల్యాండ్‌మార్క్ 10వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. 'దశావతారం' కాన్సెప్ట్‌తో ఈసారి షోను మరింత గ్రాండ్‌గా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ హౌస్, కొత్త గేమ్స్, ఊహించని ట్విస్టులు, పాపులర్ కంటెస్టెంట్లతో ఈ సీజన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే?
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే?

బిగ్ బాస్‌కు నాగార్జునే బ్రాండ్?
తెలుగు బిగ్‌బాస్ తొలి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే మూడో సీజన్ నుంచి నాగార్జున బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వరుసగా ఏడు సీజన్లుగా ఆయన హోస్ట్‌గా కొనసాగుతున్నారు. కింగ్ నాగ్ కంటెస్టెంట్లతో మాట్లాడే తీరు, వీకెండ్ ఎపిసోడ్లలో క్లాస్‌లు తీసుకునే విధానం, వివాదాలను బ్యాలెన్స్ చేసే స్టైల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, మధ్యలో కొన్ని సీజన్లపై విమర్శలు వచ్చినప్పటికీ, నాగార్జున హోస్టింగ్ మాత్రం షోకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని బుల్లితెర వర్గాలు భావిస్తాయి. ఈసారి కూడా 10వ సీజన్‌కు ఆయననే కొనసాగించాలని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు.

Nagarjuna Charging Rs 40 Crore
Recommended For You
Lenin 9 Days BoxOffice: లెనిన్ బాక్సాఫీస్ స్టామినా ఇదే.. అఖిల్ అక్కినేని మూవీ ఎన్ని కోట్లంటే?
Lenin 9 Days BoxOffice: లెనిన్ బాక్సాఫీస్ స్టామినా ఇదే.. అఖిల్ అక్కినేని మూవీ ఎన్ని కోట్లంటే?

రూ.40 కోట్ల రెమ్యునరేషన్?
సోషల్ మీడియా ప్రచారం ప్రకారం.. నాగార్జున గత సీజన్‌కు ఆయన దాదాపు రూ.30 నుంచి రూ.35 కోట్ల మధ్య పారితోషికం అందుకున్నారని టాక్. ఇప్పుడు 10వ సీజన్ కోసం అది రూ.40 కోట్లకు పైగా పెరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మొత్తం నిజమైతే, భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక రియాలిటీ షో హోస్ట్‌కు అందిన అత్యధిక పారితోషికాల్లో ఇదొకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ గణాంకాలపై స్టార్ మా, షో నిర్వాహకులు లేదా నాగార్జున బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

You May Also Like
రోజూ గంటసేపు అలా చేయండి.. అనసూయ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
రోజూ గంటసేపు అలా చేయండి.. అనసూయ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

బిగ్‌బాస్ సీజన్ సాధారణంగా 14 నుంచి 15 వారాల పాటు కొనసాగుతుంది. ఇందులో నాగార్జున ప్రధానంగా శని, ఆదివారాల్లో మాత్రమే కనిపిస్తారు. అంటే మొత్తం షోలో దాదాపు 30 రోజుల వరకు షూటింగ్‌లో పాల్గొంటారు. ప్రచారంలో ఉన్న రూ.40 కోట్ల పారితోషికాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కో షూటింగ్ రోజుకు ఆయన పారితోషికం కోటి రూపాయలకు మించి ఉంటుందని సోషల్ మీడియాలో లెక్కలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీలో మరోసారి కలకలం.. అప్పుడు సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ఆమిర్ ఖాన్!
ఇండస్ట్రీలో మరోసారి కలకలం.. అప్పుడు సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ఆమిర్ ఖాన్!

కంటెస్టెంట్లపై ఉత్కంఠ
హోస్ట్ రెమ్యునరేషన్‌తో పాటు ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారన్న ఆసక్తి కూడా నెలకొంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. యూట్యూబర్ నందు, పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, జ్యోతి, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, ప్రభాకర్ లేదా చంద్రహాస్ వంటి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిలో ఎవరెవరు నిజంగా షోలో పాల్గొంటారనే విషయం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.

బిగ్ సర్‌ప్రైజ్.. ప్రియాంక పాత్రపై రాజమౌళి క్లారిటీ.. అంచనాలు పెంచేశారుగా!
బిగ్ సర్‌ప్రైజ్.. ప్రియాంక పాత్రపై రాజమౌళి క్లారిటీ.. అంచనాలు పెంచేశారుగా!

అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే షో ప్రారంభ తేదీ, కంటెస్టెంట్ల జాబితా, నాగార్జున రెమ్యునరేషన్ వంటి అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం అంతా అనధికారిక నివేదికలు, ఇండస్ట్రీ టాక్ ఆధారంగానే ఉంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X