Lenin 15 Days Box Office:లెనిన్ పై జన నాయగన్, చెన్నై లవ్ స్టోరీ ఎఫెక్ట్.. అఖిల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Lenin Box Office Collection: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద సిర్థమైన కలెక్షన్లు అందుకుంటుంది. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని భారీ వసూళ్లు రాబడుతోంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత వాటిని మించి కలెక్షన్లు సాధిస్తూ అఖిల్ కెరీర్‌లోనే అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తొలి వారం రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిన 'లెనిన్'.. అయితే 15వ రోజు 'జన నాయగన్', చైన్నై లవ్ స్టోరీ విడుదల కావడంతో 'లెనిన్' కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం పడనుందా? ఇప్పటివరకు ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
భారీ ఓపెనింగ్స్
అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలై రెండు వారాలు పూర్తయిన తర్వాత కూడా ఈ సినిమా స్థిరమైన వసూళ్లతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి లాభాల బాటలోకి వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పుడు మరిన్ని రికార్డులపై కన్నేసింది. విడుదలైన తొలి రోజే ఈ సినిమా 8.22 కోట్ల రూపాయల గ్రాస్, 7.15 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది. అఖిల్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్స్‌లో ఒకటిగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక రెండో రోజు సినిమా మరింత జోరు చూపించింది. శనివారం 10.18 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఆదివారం కూడా అదే ఊపు కొనసాగిస్తూ 11.39 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మూడు రోజుల్లోనే సినిమా భారీ వసూళ్లు నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.

వీక్‌డేస్‌లోనూ వసూళ్లు ఇలా
సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమాల కలెక్షన్లు తగ్గిపోతాయి. కానీ 'లెనిన్' మాత్రం వర్కింగ్ డేస్‌లోనూ మంచి హోల్డ్‌ను కొనసాగించింది. నాలుగో రోజు 3.60 కోట్ల రూపాయలు , ఐదో రోజు 3 కోట్ల రూపాయల నెట్, ఆరో రోజు 2.15 కోట్ల రూపాయలు, ఏడో రోజు 2 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. దీంతో తొలి వారం ముగిసే సమయానికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 36. 65 కోట్ల రూపాయల నెట్, సుమారు 42 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.
రెండో వారంలోనూ తగ్గని జోరు
రెండో వారంలో కూడా సినిమా మంచి హోల్డ్‌ను కనబరిచింది. ఎనిమిదో రోజు 1.65 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజు 2.40 కోట్ల రూపాయలు, పదో రోజు ఆదివారం 2.90 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. ఆ తర్వాత 11వ రోజు 1.05 కోట్ల రూపాయలు , 12వ రోజు 85 లక్షల రూపాయలు, 13వ రోజు 77 లక్షల రూపాయలు, 14వ రోజు 70 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. ఇలా రెండో వారంలో ఈ సినిమా మొత్తం 10. 32 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. 14 రోజుల ముగింపుకు 'లెనిన్' దేశవ్యాప్తంగా 46.97 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. ఇండియా గ్రాస్ 53.06 కోట్ల రూపాయలు కాగా, ఓవర్సీస్‌లో 10.65 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా మొత్తం 63.71 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.
15వ రోజు అంచనా
మూడో శుక్రవారం కూడా సినిమా 361 కేంద్రాల్లో ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రెండ్ ప్రకారం 15వ రోజు సుమారు 60 లక్షల నుంచి 80 లక్షల మధ్య కలెక్షన్లు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మొత్తం నెట్ కలెక్షన్లు 48 కోట్ల రూపాయల మార్క్‌ను చేరువ అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇండియా గ్రాస్ 54 నుంచి 55 కోట్ల రూపాయల మధ్యకు చేరుకునే అవకాశముంది.
ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌కు సినిమా చేరువలో ఉంది. మూడోవారం నుంచి లెనిన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కొత్త పోటీ మొదలైంది. దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' భారీ స్థాయిలో విడుదల కావడంతో పాటు, 'చెన్నై లవ్ స్టోరీ'కూడా ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్లల సంఖ్య తగ్గింది. దీని ప్రభావం 'లెనిన్' కలెక్షన్లపై పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
లాభాల బాటలో 'లెనిన్'
అయినప్పటికీ, 'లెనిన్' ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి పలు ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందిస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న మంచి మౌత్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కారణంగా సినిమా ఇంకా నిలకడగా వసూళ్లు సాధిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా 10 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 88 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నిర్మాతలు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. లెనిన్ జోరు ఇలాగే కొనసాగితే ఈ వీకెండ్ ముగిసేనాటికి అఖిల్ మూవీ 100 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications





