‘విజయ్‌తో ఆ కోరిక తీరలేదు.. జన నాయగన్‌లో తీరని అన్యాయం’

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జన నాయగన్'. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లే ముందు నటించిన చివరి సినిమా కావడంతో ఈ సినమాపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి కనిపించింది. విడుదలైన తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ కూడా లభించాయి. అయితే సినిమా విజయోత్సాహం మధ్య ఓ భావోద్వేగ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జన నాయగన్ సినిమా నుంచి తన సన్నివేశాన్ని తొలగించారని ఓ నటి తీవ్ర మనస్తాపానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరు?

Also Read
Nagabandham OTT: థియేటర్లలో బిగ్ షాక్.. 21 రోజుల్లోనే ఓటీటీలోకి.. నాగబంధం‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nagabandham OTT: థియేటర్లలో బిగ్ షాక్.. 21 రోజుల్లోనే ఓటీటీలోకి.. నాగబంధం‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆ నటి ఎవరో కాదు.. తమిళ టెలివిజన్ నటి, క్లాసికల్ డ్యాన్సర్ ఆనంది అజయ్. ఈ నటి జననాయగన్ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. దాదాపు ఏడాది పాటు ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారట. విజయ్‌తో కలిసి నటించే అవకాశం రావడం తన కెరీర్‌లో ఎంతో పెద్ద మైలురాయిగా భావించానని చెప్పారు. కానీ సినిమా విడుదలైన తర్వాత తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తిగా తొలగించబడినట్లు తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

Jana Nayagan Actress Anandhi Ajay Breaks Down

సోషల్ మీడియా వేదికగా ఆనంది అజయ్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధను పంచుకున్నారు. "ఈ సినిమా కోసం ఎంతో ప్రేమతో, అంకితభావంతో పనిచేశాను. విజయ్ సర్‌తో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం నా కల. కానీ చివరకు నా సీన్స్ మొత్తం తీసేయడం చాలా బాధగా ఉంది" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్ ఇక పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లనున్న నేపథ్యంలో **'జన నాయగన్'** ఆయన చివరి చిత్రంగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా ఆయనతో మరోసారి కలిసి పనిచేసే అవకాశం జీవితంలో రాకపోవచ్చనే ఆలోచన తనను మరింత కలచివేసిందని ఆనంది తెలిపారు. అందుకే ఈ విషయం తనను మానసికంగా తీవ్రంగా బాధించిందని చెప్పారు.

బిగ్ బాస్‌లోకి సౌరవ్ గంగూలీ.. దాదా పారితోషికం ఎన్ని కోట్లంటే?
'జన నాయగన్' సినిమాకు సెన్సార్ ప్రక్రియలో కొన్ని మార్పులు సూచించిన విషయం తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దాదాపు 12 మార్పులు చేయాలని సూచించడంతో కొన్ని సన్నివేశాలు తొలగించాల్సి వచ్చినట్లు సమాచారం. అదే క్రమంలో ఆనంది పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఎడిటింగ్‌లో తొలగించబడి ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై చిత్రబృందం మాత్రం అధికారికంగా స్పందించలేదు.

Recommended For You
Chennai Love Story Public Talk: చెన్నై లవ్ స్టోరీ పబ్లిక్ టాక్.. కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?
Chennai Love Story Public Talk: చెన్నై లవ్ స్టోరీ పబ్లిక్ టాక్.. కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

ఇదే సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం కూడా ఇటీవల బయటకొచ్చింది. దర్శకుడు హెచ్. వినోద్ స్వయంగా మాట్లాడుతూ, హీరోయిన్ పూజా హెగ్డే పాత్రకు మొదట ఎక్కువ సన్నివేశాలు రాశామని, కానీ సినిమా నిడివి కారణంగా వాటిలో చాలావరకు తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. "సారీ పూజా" అంటూ బహిరంగంగా క్షమాపణ కూడా తెలిపారు. దీంతో కేవలం ఆనంది పాత్ర మాత్రమే కాదు, మరికొన్ని పాత్రల నిడివి కూడా తగ్గినట్లు స్పష్టమైంది. ఇక ఆనంది వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

You May Also Like
Jana Nayagan Movie Public Talk: జన నాయగన్ మూవీ పబ్లిక్ టాక్.. సీఎం విజయ్ సినిమా ఎలా ఉందంటే.?
Jana Nayagan Movie Public Talk: జన నాయగన్ మూవీ పబ్లిక్ టాక్.. సీఎం విజయ్ సినిమా ఎలా ఉందంటే.?

ఆనంది అజయ్ తమిళ చిన్నతెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. 'కార్తిగై పెంగళ్','యమునా, కనా కానుమ్ కాలంగళ్, కల్లికట్టు పళ్లికూడం వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. అంతేకాదు, ఆమె క్లాసికల్ డ్యాన్సర్, యోగా ట్రైనర్ కూడా. 'డ్యాన్స్ జోడీ డ్యాన్స్ 3.0', జోడి నెం.1,మానాడా మయిలాడా వంటి డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎడిటింగ్ సమయంలో సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలు లేదా సన్నివేశాలను తొలగించడం కొత్త విషయం కాదు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఇది తరచూ జరుగుతుంటుంది. ప్రస్తుతం మాత్రం ఆమె భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X