Chennai Love Story Public Talk: చెన్నై లవ్ స్టోరీ పబ్లిక్ టాక్.. కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

Chennai Love Story Public Talk: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, యువ నటి శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ'. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ గా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మాతలు ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మించగా, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Also Read
Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా, కథను సాయి రాజేశ్ రచించారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా రవి నంబూరి నిర్వహించారు. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ, భాస్కర్ ముదావత్ ఆర్ట్ డైరెక్షన్, అనంత శ్రీరామ్ సాహిత్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుండగా, జూలై 23 రాత్రి పలుచోట్ల ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో చెన్నై లవ్ స్టోరీ పబ్లిక్ టాక్ ఎలా ఉంది. కిరణ్ అబ్బవరం మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా ?

Chennai Love Story Public Talk
Recommended For You
Jana Nayagan Day 1 Collections: జన నాయగన్ బాక్సాఫీస్ సంచలనం.. విజయ్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
Jana Nayagan Day 1 Collections: జన నాయగన్ బాక్సాఫీస్ సంచలనం.. విజయ్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

ఓ ప్రేక్షకుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా గురించి మాట్లాడుతూ.. "సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు మాత్రం కొంచెం నిరాశపరిచాయి. కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఒక్కసారి తప్పకుండా చూడదగిన సినిమా. ముఖ్యంగా మణిశర్మ సంగీతం సినిమాకు పెద్ద బలం. కిరణ్ అబ్బవరం నటన మాత్రం వన్ మ్యాన్ షోలా అనిపించింది" అని అభిప్రాయపడ్డాడు.

You May Also Like
ఆ కల కోసం 8 ఏళ్ల పోరాటం.. 1000 ఇంజెక్షన్లు తీసుకున్న హీరోయిన్!
ఆ కల కోసం 8 ఏళ్ల పోరాటం.. 1000 ఇంజెక్షన్లు తీసుకున్న హీరోయిన్!

మరో ప్రేక్షకుడు మాట్లాడుతూ.. "ఇది పూర్తిగా ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా. ప్రేమకథ అయినప్పటికీ కొత్తగా అనిపించింది. కొందరు 'బేబీ' సినిమాతో పోలుస్తున్నారు. కానీ రెండూ పూర్తిగా వేర్వేరు కథలు. ఈ సినిమా తనదైన శైలిలో సాగుతుంది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి"అని చెప్పాడు. ఇంకో ప్రేక్షకుడు మాట్లాడుతూ.. "సినిమా దాదాపు మూడు గంటల నిడివి ఉన్నా ఎక్కడా బోర్ అనిపించలేదు. కథలో ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం నటన మరో స్థాయిలో ఉంది" అని పేర్కొన్నాడు.

Lenin 14 Days BoxOffice: అఖిల్‌కు సీఎం విజయ్ షాక్? లెనిన్‌ మూవీకి ఎన్ని కోట్లంటే ?
Lenin 14 Days BoxOffice: అఖిల్‌కు సీఎం విజయ్ షాక్? లెనిన్‌ మూవీకి ఎన్ని కోట్లంటే ?

హీరో, హీరోయిన్ నటనపై కూడా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. "కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ ఇద్దరూ పోటీపడి నటించారు. ఎవరు బాగా చేశారో చెప్పడం కష్టంగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సహజంగా అనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ ఆకట్టుకున్నారు" అని మరో ప్రేక్షకుడు చెప్పాడు. మరో అభిమాని అయితే సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యాడు. "కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఏడిపించాడు. సినిమా పూర్తిగా ఎమోషన్స్‌తో నడుస్తుంది. మూడు గంటలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. కథలో ఒకసారి లీనమైతే బయటకు రావడం కష్టం"అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

దళపతి విజయ్ టాప్-5 బాక్సాఫీస్ హిట్స్.. జన నాయగన్ ఆ రికార్డులు బద్దలు కొడుతుందా?
దళపతి విజయ్ టాప్-5 బాక్సాఫీస్ హిట్స్.. జన నాయగన్ ఆ రికార్డులు బద్దలు కొడుతుందా?

మరికొందరు అభిమానులు ఈ సినిమాను "కల్ట్ లవ్ స్టోరీ"గా అభివర్ణిస్తున్నారు. "ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు. ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పిన సినిమా ఇది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దర్శకుడు రవి నంబూరి టేకింగ్ చాలా బాగుంది. సాయి రాజేశ్ రాసిన కథ, ఎమోషన్స్ సినిమాకు ప్రధాన బలం" అని చెబుతున్నారు.

సెకండ్ హాఫ్‌పై కూడా పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. "ఇలాంటి కథ ఇప్పటివరకు చూడలేదు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్‌లు కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. క్లైమాక్స్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి" అని ఓ ప్రేక్షకుడు పేర్కొన్నాడు. మణిశర్మ సంగీతం గురించి దాదాపు ప్రతి ప్రేక్షకుడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. "బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. పాటలు కథలో సహజంగా కలిసిపోయాయి. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన మ్యాజిక్ చూపించారు" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఔట్.. ఆనంద్ దేవరకొండ ఇన్.. నాగవంశీ మాస్టర్ ప్లాన్?
విజయ్ దేవరకొండ ఔట్.. ఆనంద్ దేవరకొండ ఇన్.. నాగవంశీ మాస్టర్ ప్లాన్?

మొత్తంగా తొలి రోజు పబ్లిక్ టాక్‌ను బట్టి చూస్తే 'చెన్నై లవ్ స్టోరీ'కి పాజిటివ్ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం నటన, గౌరీ ప్రియతో కెమిస్ట్రీ, ఎమోషనల్ సన్నివేశాలు, మణిశర్మ సంగీతం, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన బలాలుగా ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ పాజిటివ్ టాక్ ఎంతవరకు కలెక్షన్లుగా మారుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X