Lenin Business: లెనిన్ వరల్డ్ వైడ్ బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే అఖిల్ మూవీ హిట్ అంటే?

యువ హీరో, హీరోయిన్లు అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Lenin Box Office Pre Release Business Worldwide

చిత్తూరు జిల్లాలో శ్రీరామపురంలో ద్రౌపదీని కొలిచే ఓ సంప్రదాయాన్ని పాయింట్‌గా తీసుకొని మహాభారతం కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ యాక్లర్లు, టెక్నిషియన్స్‌తో సినిమాను తెరకెక్కించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ చిత్రంలో కథ, కథనాలు డిమాండ్ చేయడంతో రాజీ పడకుండా క్వాలిటీతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Also Read
 Dhamaal 4 First Review: ధమాల్ 4 హిందీ మూవీ ఫస్ట్ రివ్యూ
Dhamaal 4 First Review: ధమాల్ 4 హిందీ మూవీ ఫస్ట్ రివ్యూ

లవ్, యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. రిలీజ్‌కు ముందే ఫ్యాన్సీ రేటును ఇచ్చి శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు టెలివిజన్, ఓటీటీ రైట్స్‌ను Zee5 సొంతం చేసుకొన్నది. ఈ సినిమా బడ్జెట్‌లో దాదాపు 30 శాతం రికవరీని సాధించాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Recommended For You
Spider Man: Brand New Day Box Office: స్పైడర్ మ్యాన్ బాక్సాఫీస్ సంచలనం.. రిలీజ్‌కు ముందే ఎన్ని కోట్లంటే?
Spider Man: Brand New Day Box Office: స్పైడర్ మ్యాన్ బాక్సాఫీస్ సంచలనం.. రిలీజ్‌కు ముందే ఎన్ని కోట్లంటే?

లెనిన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండటమే కాకుండా నిర్మాతలు నాగవంశీ, అక్కినేని నాగార్జునకు పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయంపై నమ్మకం ఏర్పడింది. దాంతో ఈ చిత్రాన్ని నిర్మాత నాగవంశీ సొంతంగా ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 40 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టినట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కర్ణాటక రైట్స్ సుమారుగా 8 కోట్ల రూపాయల మేర, ఇతర రాష్ట్రాల్లో కలిపి 2 కోట్ల రూపాయలు అమ్ముడుపోయాయి.

You May Also Like
ఇద్దరు మాజీ భార్యల సమక్షంలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. సల్మాన్, షారుక్ డుమ్మా ఎందుకంటే?
ఇద్దరు మాజీ భార్యల సమక్షంలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. సల్మాన్, షారుక్ డుమ్మా ఎందుకంటే?

ఇక ఈ సినిమాను ఓవర్సీస్‌లో శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా రిలీజ్ అవుతున్నది. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వాల్యూ సుమారుగా 20 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల మేర వాల్యూ కట్టారు అని చెప్పారు. ఈ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తే.. బ్లాక్ బస్టర్ టాక్‌ వచ్చినట్టే అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X