Sing Geetham Closing Collections: సింగ్ గీతం క్లోజింగ్ కలెక్షన్లు.. నాగ్ అశ్విన్ మూవీకి లాభమా? నష్టమా?

తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్‌పై లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం సింగ్ గీతం (Sing Geetham). ఈ చిత్రాని మహానటి, కల్కి సినిమాల దర్శకుడు, జాతిరత్నాలు నిర్మాత నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ చిత్రంలో అహల్య బమ్రూ, ఆయన్, షాలిని కొండెపూడి, శివ నారాయణ, బెనర్జీ తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫి: అకుంర్ సీ, ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: సంకల్ప్ గోరా,రచన: సింగీతం శ్రీనివాసరావు తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూన్ 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం బిజినెస్ ఎంత? ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Sing Geetham Box office Closing Collections

హ్యుమన్ వాల్యూతో మ్యూజికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను కొత్త నటీనటులతో రూపొందించారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేశారు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో తీవ్ర విషాదం.. ఐసీయూలో బాలీవుడ్ యాక్టర్!
ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో తీవ్ర విషాదం.. ఐసీయూలో బాలీవుడ్ యాక్టర్!

ఇక మాటలు తక్కువగా పాటలతోనే సంభాషణలు రూపొందించి ప్రయోగాత్మక చిత్రంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ ఆదరణ లభించడంతో నాన్ థియేట్రికల్ బిజినెస్‌కు మంచి డిమాండ్ కనిపించింది. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ హక్కుల ద్వారా ఈ సినిమాకు 6 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. అంటే నాన్ థియేట్రికల్ ద్వారా ఈ సినిమా 60 శాతం రికవరీ సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Recommended For You
తమిళనాడులో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌పై నిషేధం? త్రివిక్రమ్‌పై తీవ్ర ఆగ్రహం
తమిళనాడులో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌పై నిషేధం? త్రివిక్రమ్‌పై తీవ్ర ఆగ్రహం

ఇదిలా ఉండగా, భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సొంతంగా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ కమీషన్ బేస్ మీద డిస్ట్రిబ్యూట్ చేయడం తెలిసిందే. ఈ చిత్రం తొలి వారం 4.5 కోట్ల రూపాయల నెట్, రెండో వారంలో 1 కోటి రూపాయల నెట్, మూడో వారంలో 50 లక్షల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో సుమారుగా 6 కోట్ల రూపాయల నెట్, 7 కోట్ల రూపాయల గ్రాస్ ఇండియాలో వసూలు చేసింది.

You May Also Like
కంగన రనౌత్ మూవీపై 250 కోట్ల దావా.. వివాదంలో బాలీవుడ్ క్వీన్ సీక్వెల్!
కంగన రనౌత్ మూవీపై 250 కోట్ల దావా.. వివాదంలో బాలీవుడ్ క్వీన్ సీక్వెల్!

ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయల గ్రాస్, 4 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రాజెక్ట్ పరంగా ఈ సినిమా లాభాలతో ముగిసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X