The India Story Day 1 Collections: ది ఇండియా స్టోరీ కలెక్షన్స్.. కాజల్ అగర్వాల్ మూవీకి తొలిరోజు ఎంతంటే?
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత తన ఇమేజ్, వయసును బట్టి ఆచితూచి ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సత్యభామతో ఈ జోనర్‌లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్.. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన క్యారెక్టర్‌పై వచ్చిన ప్రశంసలతో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ వైపు ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా ఆమె నటించిన తాజా సినిమా ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్. దేశంలో ఆహారం కల్తీ కావడం, వ్యవసాయంలో రసాయనాల వాడకం, పెరుగుతున్న క్యాన్సర్ కేసుల ఇతివృత్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ది ఇండియా స్టోరీ తారాగణం
చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బీ షిండే నిర్మిస్తున్నారు. శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా, అతుల్ తివారి, కమలేష్ సావంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిషాంత్ భగవత్ సినిమాటోగ్రాఫర్‌గా, మంగేష్ ధాక్డే సంగీత దర్శకుడిగా, అనీశ్ మాత్రే ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ మూవీలో పవర్‌ఫుల్ లాయర్‌గా నటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషలలో జూలై 24న ది ఇండియా స్టోరీ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ది ఇండియా స్టోరీ వసూళ్లు ఎంత? అనేది పరిశీలిస్తే..

ది ఇండియా స్టోరీ బడ్జెట్
ది ఇండియా స్టోరీ బడ్జెట్ వివరాలు తెలియరాలేదు. అయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఈ సినిమాను 20 నుంచి 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించి ఉండొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ది ఇండియా స్టోరీలో నటించినందుకు గాను కాజల్ అగర్వాల్ 3 కోట్ల రూపాయలు, శ్రేయాస్ తల్పాడే 2 కోట్ల రూపాయలు, మురళీ శర్మ 50 లక్షల రూపాయలు, మనీశ్ వాద్వా 35 లక్షల రూపాయలు, కమలేష్ సావంత్ 15 లక్షల రూపాయలు, అతుల్ తివారీ 10 లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా బాలీవుడ్ టాక్.
ది ఇండియా స్టోరీకి టఫ్ ఫైట్
ది ఇండియా స్టోరీ మూవీకి చిత్ర యూనిట్ బాగానే ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది. కాజల్ అగర్వాల్, దర్శకుడు చేతన్‌లు హైదరాబాద్, ముంబై, చెన్నైలలో పలు ఈవెంట్స్‌కు హాజరుకావడంతో పాటు ఇంటర్వ్యూలు ఇచ్చారు. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు కాజల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో భారీ చిత్రాలు ది ఇండియా స్టోరీకి పోటీగా నిలిచాయి. ఇంగ్లీష్ చిత్రం ది ఒడిస్సీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జన నాయగన్, తెలుగులో లెనిన్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలతో పాటు హిందీలో ధమాల్ 4, తేరా యార్ హూ మై సినిమాలు గట్టి పోటీని ఇస్తున్నాయి. అయితే కథ, కంటెంట్‌పై నమ్మకంతోనే ది ఇండియా స్టోరీ మేకర్స్ రిలీజ్‌కు సై అన్నారు.
ది ఇండియా స్టోరీ తొలిరోజు వసూళ్ల అంచనా
కాజల్ అగర్వాల్ మూవీకి తొలిరోజున వరల్డ్ వైడ్‌గా 1.50 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వీకెండ్‌పైనే ఈ సినిమా ఆశలు పెట్టుకుంది. మరి ఇంతటి పోటీ మధ్యలో ది ఇండియా స్టోరీ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications


