Celebs » Allu Arjun » Biography
బయోగ్రఫీ
అల్లు అర్జున్ తెలుగు సిని నటుడు అభిమానులందరు బన్నీ, స్టయిలిష్ స్టార్ అని పిలుసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్, 8 Apr 1983 అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మల  గారికి మద్రాసు లో జర్మించారు.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జననం మద్రాసులో జరిగింది. ప్రాదమిక విద్య అనంతరం యానిమేషన్ లో కోర్స్ పూర్తిచేసి కెనడాలో ఫై చదువులు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ 'డాడీ' సినిమాలో ప్రత్యెక పాత్రలో నటించి ఆకర్షించాడు. ఆ తరవాత  అనూహ్యంగా వచ్చిన 'గంగోత్రి' (2003) సినిమాలో అవకాశంతో పూర్తిస్థాయి నటుడిగా మారాడు. హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ తెరంగేట్రం తేలికగానే జరిగింది, కానీ దానిని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎర్పరచుకోవటంలో అల్లు అర్జున్ కృషిని అభినందిచవలసిందే. గంగోత్రి తరవాత ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య' గా  యువత మనసులో స్థానం సంపాయించాడు. ఆర్య తో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందాడు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండటం విశేషం. ఆ తరవాత రిలీజ్ అయిన 'బన్నీ' హిట్ తో హట్రిక్ పూర్తిచేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడనుంచి  చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక  ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇజ్ తో, డాన్సులో స్టైల్ తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టాడు. 

'పరుగు' లో కృష్ణ గా చక్కని నటనతో ఆకట్టుకుని, 'వేదం' తో నవతరం నాయకులలో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతే కాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ ను సీరియస్ గా తీసుకుని  సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత  అల్లుఅర్జున్ ది. 

అవార్డులు:

నంది అవార్డులు:
2004 - ఆర్య - స్పెషల్ జ్యూరి 
2008 - పరుగు - స్పెషల్ జ్యూరి 

ఫిలింఫేర్:
2008 - ఉత్తమ నటుడు.
స్పాట్ లైట్ లో ఉన్న సినిమాలు
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more