అంకిత బయోగ్రఫీ
అంకిత ముంబాయిలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి గుజరాతీ, తల్లి పంజాబీ. తండ్రి వజ్రాల వ్యాపారి. లాహిరి లాహిరి లాహిరిలో తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ సినిమాలో అంకిత నటనకు మన్ననలు పొందింది. దాంతో జూనియర్ ఎన్టీయార్ సరసర సింహాద్రిలో నటించే అవకాశం వచ్చింది. సింహాద్రి విజయవంతమవటంతో అంకితకు అనేక సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కొన్ని చెత్త సినిమాలు చేయటం వల్ల తెలుగు సినీరంగంలో వెనకబడిపోయింది. అయితే కొత్త కథనాయకిల వెల్లువలో ఈమెకూ అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది.