twitter

    బప్పీలహరి బయోగ్రఫీ

    బప్పీ లహరి  హిందీ సంగీత దర్శకుడు. 1952 నవంబర్‌ 27న బెంగాల్‌లో బప్పీలహరి జన్మించారు. భారతీయ చలనచిత్రంలో సింథసైజ్డ్ డిస్కో సంగీతాన్ని ఉపయోగించడాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. బప్పి లహిరి 1970-80 చివరలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి అనేక చిత్రాలలో సూపర్ పాటలను అందించారు. 

    తెలుగులో బప్పి లహిరి సింహాసనం సినిమాకు సంగీతం అందించాడు.. ఆ తర్వాత స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‏స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు.ఆయన ఆలపించిన 'చల్తే చల్తే', 'డిస్కో డ్యాన్సర్'​, 'షరాబీ' వంటి గీతాలను యువతను ఉర్రూతలూగించాయి.

    హిందీ, తెలుగు, బెంగాళీ, తమిళం, కన్నడ, గుజరాతీ చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. బాలీవుడ్‌లో 50కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

    2020లో శ్రద్దా కపూర్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బాఘీ 3లో భంకాస్ పాట చివరిగా ఆలపించారు. తెలుగులో చివరిగా డిస్కోరాజా చిత్రంలోనూ ఆయన పాట పాడారు.

    మరణం

    ముంబయ్ లోని ఓప్రైవేట్ హస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ 16/02/2022న 69 ఏళ్ల వయస్సులో బప్పీ లహరి మరణించారు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X