X
హోమ్ » సెలెబ్స్ » కాజల్ అగర్వాల్ » తెలియని విషయాలు
కాజల్ అగర్వాల్
Actress/Actor

కాజల్ అగర్వాల్ - తెలియని విషయాలు

  • 1
    కాజల్ అగర్వాల్.. అసలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరు. పదిహేనేళ్ళుగా హీరోయిన్ గా కొనసాగుతోంది.
  • 2
    టాప్ స్టార్ల నుండి యంగ్ హీరోల వరకూ దాదాపుగా అందరితో నటించిన కాజల్ పేరు తెలియని తెలుగు సినీ ప్రేమికుడు ఉండడు.
  • 3
    కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న మహారాష్ట్రలోని ముంబాయి లో జన్మించింది. నిషా అగర్వాల్ చెల్లేలు.
  • 4
    ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది.
  • 5
    2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.
  • 6
    హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది.
  • 7
    తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు.
  • 8
    చిరంజీవీ రీఎంట్రీ ఖైధీ నెం 150 లో హిరోయిన్ గా నటించింది. చిరంజీవి, రామ్ చరన్ ఇద్దరి కి హీరోయిన్ గా చేసి రికార్డ్ నెలకొల్పింది.
  • 9
    కాజల్ అగర్వాల్ ట్విట్టర్ లో 2.67 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 10.9 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.
  • 10
    కాజల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో శర్వానంద్ 'రణరంగం' లో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో 'కోమలి'.. 'ప్యారిస్ ప్యారిస్' సినిమాల్లో నటిస్తోంది. శంకర్ - కమల్ హాసన్ 'ఇండియన్ 2' లో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్.
  • 11
    సమయం దొరికినప్పుడల్లా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో యువత గుండెల్లో కాక పెంచుతూ వుంటుంది. చూడాలి మరి ఇంకెన్నాళ్ళు కాజల్ గ్లామర్ కి గిరాకి ఉంటుంది అన్నది.
  • 12
    దాదాపు 15 ఏళ్లుగా కెమెరా ముందు రాణిస్తున్న కాజల్.. అందరు అగ్ర హీరోల సరసన నటించింది. అంతేకాదు 50 సినిమాల మార్క్ కూడా దాటేసిన హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.
  • 13
    చిరంజీవి రీ ఎంట్రీ హీరోయిన్‌గా ‘ఖైదీ నంబర్ 150’లో ఆయనతో రొమాన్స్ చేసింది కాజల్. అలా తండ్రీకొడుకులు చిరంజీవి,రామ్ చరణ్ సరసన నటించిన హీరోయిన్‌గా కూడా అమ్మడికి స్పెషల్ పాపులారిటీ ఉంది.
  • 14
    ప్రస్తుతం సీనియర్, జూనియర్ హీరోలందరికీ బెటర్ ఛాయిస్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో 'ఆచార్య' సినిమాలో, కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' మూవీలో అలాగే మంచు విష్ణు సరసన 'మోసగాళ్లు' మూవీలో నటిస్తోంది.
  • 15
    ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ విగ్రహాన్ని ఉంచడం అమ్మడికి దక్కిన అరుదైన గౌరవం. ఈ మ్యూజియంలో స్థానం సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్‌గా కాజల్ రికార్డు సృష్టించింది.
  • 16
    అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ బాబు, ప్రభాస్, కాజోల్, కరీనా కపూర్ విగ్రహాలతో పాటు కాజల్ విగ్రహాన్ని ఉంచడం విశేషం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+