twitter

    కత్రినా కైఫ్ బయోగ్రఫీ

    కత్రినా కైఫ్ భారతీయ సినీ నటి, మోడల్  16 జూలై 1983న బ్రిటిష్ హాంగ్ కాంగ్ లో జన్మించారు.   ఆమె తండ్రి కశ్మీరీ కాగా, తల్లి బ్రిటన్ కు చెందినవారు. ఆమె బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించారు. హిందీతో పాటు తెలుగు, మళయాళం సినిమాల్లో కూడా నటించారు. 

    ఆమె తెలుగులో మల్లీశ్వరి (2004), అల్లరి పిడుగు (2005)  సినిమాలలో నటించారు. ఈ సినిమాలో మంచి నటన కనబరిచింది. బాలీవుడ్ లో  ఆమె చేసిన మైనే ప్యార్ క్యూ కియా (2005), నమస్తే లండన్ (2007) వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఆమె నటిస్తున్న సినిమాలు హిట్ అవుతున్నా, ఆమె నటనకు మాత్రం విమర్శలు వచ్చాయి.

    2009లో ఉగ్రవాదం గురించి తీసిన న్యూయార్క్ సినిమాలో ఆమె నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు కత్రినా. ఆ తరువాత అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ (2009), రాజ్నీతీ (2010), జిందగీ నా మిలేగీ దుబారా (2011) సినిమాల్లో నటించారామె. మేరే బ్రదర్ కీ దుల్హన్ (2011) సినిమాతో రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్ అందుకున్నారు ఆమె. ఆ తరువాత ఆమె  నటించిన ఏక్ థా టైగర్ (2012), ధూమ్3 (2013) సినిమాలు అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆమె నటనకు ఎన్నో విమర్శలు వచ్చినా, ఆమె ఎన్నో కమర్షియల్ గా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ, టాప్ హీరోయిన్ గానే కొనసాగుతూ వచ్చారు.


    భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఈమె కూడా ఒకరు. కత్రినాను మీడియా అత్యంత ఆకర్షణీయమైన సెలెబ్రటీగా గుర్తించింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X