మిత్రా శర్మ బయోగ్రఫీ
1993 వ సంవత్సరం మే 24 న ముంబైలో పుట్టిన మిత్రా శర్మ అసలు పేరు మిత్రబింద. ఈమె ముంబైలోనే పెరిగారు. తండ్రి సలహా సూచనలతోనే ఆమె నటనపై ఇష్టాన్ని పెంచుకున్నారు. అయితే.. తండ్రి చనిపోవడంతో ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు బంధువులు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయింది.
హైదరాబాద్ కి వచ్చాక అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలని భరించింది. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించి అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. “తొలి సంధ్య వేళలో” అనే సినిమాలో ఆమెకి హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత ఓ రెండు సినిమాల్లో కూడా నటించారు కానీ అవి అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు. నార్త్ అమ్మాయే అయినా.. మిత్రా తెలుగు బాగా మాట్లాడతారు. “‘శ్రీపిక్చర్స్” అనే నిర్మాణ సంస్థని కూడా స్థాపించి.. “బాయ్స్” అనే బోల్డ్ సినిమాని సొంతంగా నిర్మించారు.
“బాయ్స్” సినిమాలో మిత్రా కూడా హీరోయిన్ గా నటించింది. గ్లామర్ , పెర్ఫార్మన్స్ విషయంలో తగ్గేదే లేదని నిరూపించింది.