నవీన్ పొలిశెట్టి
Born on 27 Dec 1989 (Age 35)
నవీన్ పొలిశెట్టి బయోగ్రఫీ
నవీన్ పొలిశెట్టి భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటుడు, తెలుగు మరియు హిందీ భాషా చిత్రాలలో నటిస్తున్నారు.
నవీన్ మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి, భోపాల్) నుండి పట్టభద్రుడయ్యాక సివిల్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత నాటకాలలో నటుడు అయ్యాడు. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోల్లో నటించడం ద్వారా యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందాడు.
మొదటి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో మెరిశాడు నవీన్. ఆ తర్వాత హీరో గా 2019లో విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మంచి విజయాన్ని అందుకున్నది. ఏజెంట్ సినిమాతో నవీన్‌కు మంచి పాపులారిటీ రావడమే కాకుండా ఇమేజ్ పెరిగింది. అదే సంవత్సరం "చిచోర్" ద్వారా హిందీ సినిమాల్లోకి ప్రవేశించి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ యువ హీరో ఇపుడు జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.