CelebsbredcrumbNitinbredcrumbUnknown Facts

  Unknown Facts

  • 1
   తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్. కాంతారావు తర్వాత మళ్లీ టాలీవుడ్ ల హీరోగా నిలదొక్కుకున్నది ఈ అల్లరి బుల్లోడే. 1983 మార్చి 30న జన్మించారు
  • 2
   నితిన్ ది నిజామబాద్ జిల్లా..తండ్రి పేరుసుధకర్ రెడ్డి..నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఈయను మంచి పేరుంది. అందుకే సినిమా వాతావరణంలో పెరిగిన నితిన్ కి హీరో కావాలనే ఇంట్రస్ట్ ఛిన్నప్పటి నుంచే ఉంది.
  • 3
   నువ్వు-నేను సినిమా సమయంలో డైరెక్టర్ తేజ.. నితిన్ ని చూసి నా తర్వాత సినిమా హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. వెనకాల తండ్రి సపోర్ట్ గూడ ఉండే సరికి నితిన్ హీరోగానికే ఎక్కువ టైం పట్టలేదు. ఇక ఫస్ట్ సిన్మాతోనే.. హీరోని జయం వరించింది.
  • 4
   జయం సినిమా సక్సెస్ తర్వాత ఇండస్ట్రీ మొత్తం నితిన్ గురించే మాట్లాడుకుంది. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును గూడ అందుకున్నాడు నిలిన్. ఆ తర్వాత నితిన్‌కు వరుసగా చాన్సులచ్చాయి. ఆ తర్వాత వి.వి వినాయక్ తో చేసిన దిల్ కూడా బంపర్ హిట్టయ్యే సరికి..ఎనర్జిటిక్ హీరోగ ఎస్టాబ్లిష్ అయ్యాడు నితిన్.
  • 5
   ఆ తరువాత వచ్చిన సంబరం, శ్రీఆంజనేయం లాంటి సినిమాల యావరేజ్ గా నడిచాయి. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘సై’ సిన్మా నితిన్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.
  • 6
   ‘సై‘ ఎంత సూపర్ హిట్టో.. ఆ తర్వాత నితిన్ చేసిన సినిమాలు అంతా సూపర్ ఫ్లాపులయినయ్. వరుసగా ఈ ఈ హీరోని డజన్ ఫ్లాపులు పలరించాయి. అవేమి లెక్క చేయకుండా..సినిమానే పాణం అనుకుంటా..హిట్టుకోసం మస్త్ కష్టడ్డాడు. అనుకున్నట్టే చాలా ఏళ్లకు అందరిని ‘ఇష్క్’ ల పడేసి..అమ్మాయిల గుండెల్ని గల్లంతు చేసాడు.
  • 7
   దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నితిన్ అల్లరి బుల్లోడుగా అలరించాడు. ఈ చిత్రంలో తొలిసారిగా డబుల్ యాక్షన్ చేసి వావ్ అనిపించాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
  • 8
   విక్టరీ మూవీలో నితిన్ తన సిక్స్ ప్యాక్ తో ఔరా అనిపించాడు.హీరోగానే కాకుండా.. నిర్మాతగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యే గుర్తింపు తెచ్చుకున్న నితిన్
  • 9
   కరోనా ఫస్ట్ వేవ్ ముందు ‘భీష్మ’తో సక్సెస్ అందుకొనున్నారు. ఆ తర్వాత చేసిన సినిమాలేవి అలరించలేకపోయాయి. గతేడాది నితిన్ నటించిన మ్యాస్ట్రో మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది
  • 10
   ఈ చిత్రంలో దుర్మార్గులైన రాజకీయ నాయకులను భరతం పట్టే ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులను నితిన్ ఏ విధంగా చక్కదిద్దాడనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్ట్ టైమ్ నితిన్ ఒక ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌‌ను త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.
  • 11
   హిందీలో నితిన్ డబ్బింగ్ సినిమాలను 2.3 బిలియన్ రెండు వందల ముప్పె కోట్ల మంది యూట్యూబ్ వేదికగా చూసారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ రికార్డు అందకున్న ఏకైక హీరోగా నితిన్ రికార్డులకు ఎక్కారు. నితిన్ దరిదాపుల్లో కేవలం రామ్ పోతినేని మాత్రమే హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో 2 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన హీరోగా నిలిచారు. మొత్తంగా నితిన్.. ఇంట గెలిచి.. ఇపుడు యూట్యూబ్ వేదికగా బీటౌన్‌లో రచ్చ చేయడం మాములు విషయం కాదు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X