రోజా సెల్వమణి బయోగ్రఫీ

  రోజా సెల్వమణి దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి మరియు రాజకీయవేత్త. ఈమె తెలుగు సినిమా నటి. చిత్తూరు జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. డాక్టర్‌ శివప్రసాద్‌ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్‌ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు.
  తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కె.సెల్వమణి గారు చెంబరుతి చిత్రం ద్వారా పరిచయం చేశారు, ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నరు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా కర్యక్రమాలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు. తెలుగులొ సమ్మక్క సారక్క, అన్నమయ్య, శుభలగ్నం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, బొబ్బిలి సింహం వంటి సినిమాలలో నటించారు. ఈమె వివాహం ఆర్.కె.సెల్వమణితొ జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు.

  2009 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

  2014 నవంబరులో నగరి నియోజకవర్గం వైయస్సార్ పార్టీ తరపు నుండి పోటి చేసి MLA గా గెలుపొందారు.

  2019  చిత్తూరు జిల్లా నగరిలో ఆర్కే రోజా మరోసారి గెలుపొందారు. 2వేల 681 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X