twitter
    CelebsbredcrumbSadhabredcrumbBiography

    సదా బయోగ్రఫీ

    సదా ఒక ప్రముఖ భారతీయ నటి. ఆమె మాతృభాష మరాఠీ అయినప్పటికీ, ఆమె వివిధ తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది.

    సదా మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి. ఆమె రత్నగిరి లో సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూలు లో చదివింది. తరువాత ముంబై కి మారింది. అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం జయం లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సదా ముంబై లో నివసిస్తుంది. హైదరాబాదులో ఒక ఇల్లుంది.

    జయం సినిమా తో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత విక్రం సరసన శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తెలుగులోనే కాక, తమిళ కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది.

    జయం, నాగ, లీలామహల్ సెంటర్, దొంగ దొంగది, చుక్కలో చంద్రుడు, అపరిచితుడు వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X