సాయి పల్లవి
Born on 09 May 1992 (Age 31) తమిళనాడు
సాయి పల్లవి బయోగ్రఫీ
సాయిపల్లవి ఒక సినీ నటి. సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ జన్మించింది. సెంతామరై కన్నన్, రాధామణి తల్లిదండ్రులు. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది.
ఈమె చిన్నప్పటి నుండి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. తెలుగు టెలివిజన్ డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల, జార్జియాలో వైద్య విద్యనభ్యసించింది. ఫిదా సినిమాలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, తెలుగు సినిమాల్లో కథానాయికగా నటించారు.
వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించడానికి అవకాశంరావడంతో.. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించి తెలుగు సినిమాకి పరిచయమయింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రం లో నటించింది. సూర్యా 36, కణం, మారి 2, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి చిత్రాలలొ నటించింది.
సంబంధిత వార్తలు