twitter

    సందీప్ రెడ్డి వంగ బయోగ్రఫీ

    సందీప్ రెడ్డి వంగా తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. సందీప్ 1988, డిసెంబర్ 25న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లులో జన్మించాడు. 8వ తరగతి వరకు వరంగల్లులోని ప్లాటినం జూబ్లీ హైస్కూల్ మరియు అఘాఖాన్ ఎడ్యుకేషనల్ సోసైటీ స్కూల్లో చదివిన సందీప్, 10వ తరగతి నుండి 12వ తరగతి వరకు హైదరాబాదులో చదివాడు. దార్వాడలోని ఎస్.డి.ఎం. వైద్య కళాశాలలో ఫిజియోథెరఫీ పూర్తిచేసి, కొన్నాళ్లు వైజాగ్ లో ఉద్యోగం చేసాడు.

    సినిమారంగంపై ఉన్న ఆసక్తితో ఆస్ట్రేలియా, సిడ్నీలోని అకాడమీ అఫ్ ఫిలిం, థియేటర్ అండ్ టెలివిజన్ లో ఫిలిం మేకింగ్ ఫై శిక్షణ తీసుకొని..2010 నుండి సినిమారంగంలోని వివిధ విభాగాల్లో పనిచేసిన సందీప్, 2010లో కేడి సినిమాకు సహాయ దర్శకుడిగా.. 2015లో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాకు సహా దర్శకుడిగా పనిచేసాడు. 

    సందీప్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ, శాలిని హీరో హీయిన్ గా వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. 2017, ఆగష్టు 26న విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సందీప్ కి, చిత్ర యూనిట్ కి మంచి పేరు వచ్చింది. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X