సిల్క్ స్మిత బయోగ్రఫీ

  సిల్క్ స్మిత దక్షిణ భారత సినీ నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం మరియు హిందీ భాషలలో 200పైగా సినిమాలలో నటించింది. 

  బయోగ్రఫీ

  ఏళూరు (ఆంధ్రప్రదేశ్‌లోని) లో ఒక పేద కుటుంబంలో విజయలక్షిమిగా జన్మించిన ఆమె నాల్గవ తరగతి తర్వాత పాఠశాల నుండి తప్పుకుంది, సినీ నటి గా ఎదగాలని నిశ్చయించుకుంది.  మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది."స్మిత" అని తెరపేరు ధరించింది.సిల్క్ స్మిత మొదటి చిత్రము తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్, బహుళ ప్రజాదరణ పోందడంతో ఆమె తన పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది

  కెరీర్

  200పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి. ఉదాహరణకు తెలుగులో "బావలు సయ్యా, మరదలు సయ్యా" పాట. కొందరు సినిమా విలేఖరులు, విమర్శకులు ఆమెను "soft porn" actress గా అభివర్ణించారు. ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, కామోద్దీపనము కలిగించే దుస్తులతోను, ముదురు అమ్మాయిలాగా కనిపించింది. అయితే "సీతాకోక చిలుక" (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రకలలోను మెప్పించింది


  డెత్

  1996 సెప్టెంబర్ 23 న, స్మిత తన చెన్నై అపార్ట్మెంట్లో చనిపోయింది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్దపెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిసృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావిస్తున్నారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X