twitter

    వెన్నెలకంటి బయోగ్రఫీ

    వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ వెన్నెలకంటి 1957, నవంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో జన్మించాడు.  తెలుగు సినిమా మాటల, పాటల రచయిత. ఈయన ఇంటి పేరు వెన్నెలకంటి గానే సుప్రసిద్ధుడు. 

    వెన్నెలకంటి స్వస్థలం నెల్లూరు. 11 యేళ్ళ వయసులో ఆటవెలదిలో భక్త దుఃఖనాశ పార్వతీశ మకుటంత శతకం రాసిన వెన్నెలకంటి.. 13 సంవత్సరాల వయసులో లలితా శతకం రాశారు. శ్రీరామచంద్రుడు సినిమాతో గీత రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. 

    1979లో చంద్రగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న సమయంలో సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో వెన్నెలకంటి సినీరంగంలో అడుగుపెట్టారు. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ గేయ రచయితగా స్థిరపడ్డారు. 

    వెన్నెలకంటి దాదాపు రెండు వేల పాటలు రాశారు. ఆదిత్య 369, ఘరానా అల్లుడు, ఘరానా బుల్లోడు, క్రిమినల్, శ్రీ కృష్ణార్జున విజయం, సమరసింహారెడ్డి, శీను వంటి చిత్రాల్లో మంచి పాటలు రాశారు. ఆయన చివరిగా పెంగ్విన్ సినిమాకు పనిచేశారు. 1988లో వచ్చిన మహర్షి సినిమాలో వెన్నెలకంటి రాసిన మాటరాని మౌనమిది పాట ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరేట్.


    జనవరి 5, 2021 గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X