వేణు తొట్టెంపూడి
Born on 04 Jun 1976 (Age 47)
వేణు తొట్టెంపూడి బయోగ్రఫీ
తొట్టెంపూడి వేణు గారు ప్రకాశం జిల్లాలోని కొండపి మండలం పెరిదేపి గ్రామంలో జన్మించారు. పెరిగింది మాత్రం ఒంగోలు, విజయవాడ, మదురై లో. వేణు తండ్రి కృష్ణమూర్తి గారు ఇంగ్లీష్ లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి పూర్తి చేసారు.
కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన స్వయంవరం అనే సినిమా వేణు తొలి సినిమా. ఇందులో లయ కథానాయికగా నటించింది. లయకు కూడా ఈ సినిమా మొదటిది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఆ సినిమాలో నటనకు వేణుకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలోనే 2000లో వచ్చిన చిరునవ్వుతో అనే సినిమా కూడా విజయాన్ని చవిచూసింది.
చిరునవ్వు తో, హనుమాన్ జుంక్షన్, గోపి గోపిక గోదావరి వంటి పలు సినిమాల్లో నటించి కుటుంబ ప్రేక్షకులను అలరించారు. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ గారి తరువాత మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. వేణు కథానాయకుడిగానే కాకుండా సహాయనటుడిగా, నిర్మాతగా, మాటల రచయిత గా కూడా పలు చిత్రాలకు పనిచేశాడు.
వేణు 2013 లో రామాచారి అనే చిత్రంలో నటించాడు. ఆ సినిమా తరువాత బిజినెస్ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. 9 ఏళ్ళ తర్వాత 2022 లో రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన రామారావు అనే చిత్రంలో నటించాడు