Sobhita Dulipala: శోభిత ధూళిపాళ ప్రెగ్నెన్సీ? నాగచైతన్య తండ్రి కాబోతున్నాడా?

టాలీవుడ్ అగ్రనటి సమంత ఇటీవల తల్లికాబోతున్నట్లు ప్రకటించి అభిమానులను ఖుషి చేశారు. మా ఇంటి బంగారంతో సక్సెస్ అందుకున్న సామ్.. ఆ వెంటనే ప్రెగ్నెన్సీ కబురుతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. గర్బం దాల్చిన నేపథ్యంలో కొన్నాళ్లు సినిమాలకు ఆమె దూరం కానున్నారు. సమంత ప్రెగ్నెన్సీ నేపథ్యంలో ప్రస్తుతం అందరిచూపు అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ జంటపై పడింది. ఈ నేపథ్యంలో శోభిత గర్భం దాల్చారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
46 ఏళ్ల వయసులో తల్లయిన టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లైన 12 ఏళ్లకు గుడ్‌న్యూస్!
46 ఏళ్ల వయసులో తల్లయిన టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లైన 12 ఏళ్లకు గుడ్‌న్యూస్!

సమంతతో విడాకుల తర్వాత కొన్నాళ్లు తన కెరీర్‌పైనే ఫోకస్ పెట్టిన నాగచైతన్య.. శోభిత ధూళిపాళతో సైలెంట్‌గా ప్రేమాయణం సాగించారు. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ టాలీవుడ్ మీడియా కోడై కూసినప్పటికీ ఇద్దరూ స్పందించలేదు. ఒక్క సినిమా కూడా కలిసి నటించకుండా? కనీసం ఇద్దరి మధ్య ఎలాంటి పరిచయం లేకుండా ఇలాంటి గాసిప్స్ ఎందుకు సృష్టిస్తున్నారంటూ అక్కినేని ఫ్యాన్స్‌ మండిపడ్డారు. కట్ చేస్తే ఓ రోజున నాగచైతన్య - శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ జరిగిపోవడంతో అంతా షాక్ అయ్యారు.

Is Sobhita Dhulipala Pregnant Viral Photo With Naga Chaitanya Sparks pregnancy Rumors

2022లో లంచ్ డేట్ కోసం చైతన్య ముంబై వెళ్లడం.. అక్కడే శోభిత పేరెంట్స్‌ని కలవడం కూడా జరిగింది. ఆ తర్వాత శోభిత ధూళిపాళ.. నాగచైతన్యని కలవడం, వారి ప్రేమకు అక్కినేని కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2024 డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య - శోభితల పెళ్లి ఘనంగా జరిగింది. చైతన్యతో పరిచయానికి ముందు తాను ముంబైలోనే సెటిల్ అవ్వవాలని అనుకున్నానని.. సినీరంగానికి సంబంధించిన వ్యక్తి కాకుండా బయటి వ్యక్తితో డేటింగ్ చేయాలని అనుకున్నానని శోభిత పలుమార్లు తెలిపారు.

Recommended For You
సొంత ఇంటిని శివజ్యోతి ఖాళీ.. కంటతడితో అద్దె ఇంట్లోకి, బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది?
సొంత ఇంటిని శివజ్యోతి ఖాళీ.. కంటతడితో అద్దె ఇంట్లోకి, బిగ్‌బాస్ బ్యూటీకి ఏమైంది?

వివాహం తర్వాత హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లిన నాగచైతన్య - శోభిత ధూళిపాళ.. హైదరాబాద్‌లో కొత్త కాపురం మొదలుపెట్టారు. నాగచైతన్య వృషకర్మ సినిమాలో నటిస్తుండగా.. శోభిత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. తన ఇమేజ్‌, అక్కినేని బ్రాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మంచి కథలను ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇద్దరూ యాక్టీవ్‌గా ఉంటూ తమ సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు.

You May Also Like
నా తొలిప్రేమ ఆయనతోనే... లవ్‌స్టోరీని బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి
నా తొలిప్రేమ ఆయనతోనే... లవ్‌స్టోరీని బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి

ఇదిలాఉండగా శోభిత- నాగచైతన్యలు తల్లిదండ్రులు కాబోతున్నారని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. శోభిత గర్భం దాల్చారని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్లయిన తర్వాత తొలిసారిగా నాగచైతన్య కోసం గరిటె తిప్పారు శోభిత. ఈ స్పెషల్ మూవ్‌మెంట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు నాగచైతన్య.. ఇందులో శోభిత తన రెండు చేతుల్లో రెండు గిన్నెల నిండా భోజనం తీసుకుని వస్తున్నారు. దీనికి చైతన్య పెట్టిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత నా భార్య తొలిసారిగా నా కోసం డిన్నర్ ప్రిపేర్ చేసింది. బహుశా నేను ఏదో మంచి పని చేశానని అనుకుంటున్నానని చైతూ ఫన్నీ కామెంట్ పెట్టారు. దీనికి శోభిత కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. నన్ను ట్రోల్ చేస్తున్నావా? లేక పొగుడుతున్నావా? అంటూ కామెంట్ పెట్టారు.

టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్
టార్చర్ చేసి.. తెలుగులో నాపై అలా బ్యాన్.. పల్లవి గౌడ షాకింగ్ కామెంట్స్

అయితే ఈ పోస్ట్, అందులో శోభిత లుక్‌పై నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో శోభిత పొట్ట భాగం కాస్త ముందుకు రావడంతో ఆమె గర్బం దాల్చారని, బేబీ బంప్‌తో కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. దాంతో ఈ వార్త క్షణాల్లో వైరల్ అవుతోంది. మరి అభిమానులు భావిస్తున్నట్లు శోభిత - నాగచైతన్య తల్లిదండ్రులు కానున్నారా? అక్కినేని కుటుంబానికి వారసుడు రానున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే శోభిత, నాగచైతన్య స్పందించాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X