రామ్ చరణ్-ఉపాసనల డ్రీమ్ ఫామ్‌హౌస్.. ప్రత్యేకతలు ఏంటంటే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి వారసుడుగా 'చిరుత'సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తరువాత వచ్చిన మగధీర సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల'పెద్ది'సినిమాతో నటవిశ్వ రూపం చూపించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నుంచి మరో శుభవార్త రాబోతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో దాదాపు 5 ఎకరాల్లో రామ్ చరణ్-ఉపాసన డ్రీమ్ ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారట. ఈ నేపథ్యంలో మెగా వారి కోట్లాది విలువైన ఫామ్ హౌస్ . ప్రత్యేకతలు ఇవే అంటూ పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆ సంతేంటీ?

Also Read
10 ఏళ్ల నిరీక్షణకు లెనిన్‌తో తెర.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటి?
10 ఏళ్ల నిరీక్షణకు లెనిన్‌తో తెర.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటి?

సోషల్ మీడియా కథనాల ప్రకారం.. కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేవెళ్ల-మోకిల పరిసర ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఐదు ఎకరాల స్థలంలో అత్యాధునిక ఫామ్‌హౌస్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ ఫామ్ హౌస్ పూర్తయినట్లు సమాచారం.నగర రద్దీకి దూరంగా ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం పలువురు ప్రముఖుల ఫామ్‌హౌస్‌లతో అభివృద్ధి చెందుతోంది. అదే ప్రాంతంలో ఇప్పుడు రామ్ చరణ్ కూడా తన అభిరుచికి తగ్గట్టుగా అత్యంత విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్‌హౌస్ కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాకుండా, ప్రకృతికి దగ్గరగా కుటుంబంతో సమయం గడిపేందుకు, ఆర్గానిక్ వ్యవసాయం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది.

Recommended For You
రాజకీయాల్లోకి రామ్‌చరణ్? క్లారిటీ ఇచ్చిన మెగా పవర్ స్టార్!
రాజకీయాల్లోకి రామ్‌చరణ్? క్లారిటీ ఇచ్చిన మెగా పవర్ స్టార్!
Ram Charan-Upasana s Luxury Farmhouse

అత్యాధునిక సౌకర్యాలు
మెగా ఫామ్‌హౌస్ ఎన్నో ప్రత్యకతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో మోడ్రన్ ఆర్కిటెక్చర్‌తో పాటు ప్రకృతికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇందులో లగ్జరీ బెడ్‌రూమ్స్, విశాలమైన లివింగ్ స్పేస్, మోడ్రన్ కిచెన్, భారీ స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ థియేటర్, ఇండోర్ అండ్ ఔట్‌డోర్ లాంజ్ ఏరియాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ప్రశాంతంగా సమయం గడిపేందుకు వీలుగా ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా ప్రణాళిక ప్రకారం నిర్మించినట్టు తెలుస్తోంది. ఇక పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, అతిథుల కోసం ప్రత్యేక గెస్ట్ సూట్స్, భారీ లాన్ కూడా ఈ డీమ్ ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా నిలువనున్నాయంట.

You May Also Like
OTT Releases This Week: మా ఇంటి బంగారం డిజిటల్ ఎంట్రీ.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: మా ఇంటి బంగారం డిజిటల్ ఎంట్రీ.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!

ఈ ఫామ్‌హౌస్ ప్రత్యేకతల్లో ప్రధానంగా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని కూడా భావిస్తున్నారట. మొత్తం ఐదు ఎకరాల్లో కొంత భాగాన్ని మాత్రమే నిర్మాణానికి ఉపయోగించి, మిగిలిన భూమిని పూర్తిగా ప్రకృతి వ్యవసాయానికి కేటాయించాలని రామ్ చరణ్ భావిస్తున్నట్లు సమాచారం. సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు పెంచి కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ప్రకృతికి దగ్గరగా జీవించడం, ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యమని తెలుస్తోంది.

తాళి కడుతా! అంటూ రెచ్చిపోయిన జబర్దస్త్ అవినాష్.. మంగళ సూత్రంతో యాంకర్‌కు చుక్కలు!
తాళి కడుతా! అంటూ రెచ్చిపోయిన జబర్దస్త్ అవినాష్.. మంగళ సూత్రంతో యాంకర్‌కు చుక్కలు!

త్వరలో గృహప్రవేశం?
నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇంటీరియర్ ఫినిషింగ్ మాత్రమే మిగిలి ఉందని ప్రచారం జరుగుతోంది. అన్ని పనులు పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో గృహప్రవేశ వేడుక నిర్వహించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు రామ్ చరణ్ లేదా ఆయన కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఫామ్‌హౌస్ నిర్మాణానికి దాదాపు రూ.50 కోట్లపైగా ఖర్చు చేసి ఉండొచ్చని ప్రచారం. అయితే ఈ మొత్తం గురించి కూడా అధికారిక ధృవీకరణ లేదు.

ఓ ఇంటి వారైన శృతి హాసన్.. కొత్త జీవితానికి కమల్ కూతురు శ్రీకారం..
ఓ ఇంటి వారైన శృతి హాసన్.. కొత్త జీవితానికి కమల్ కూతురు శ్రీకారం..

'పెద్ది' విజయంతో జోష్‌లో రామ్ చరణ్
ఇదిలా ఉంటే, రామ్ చరణ్ ఇటీవల నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 337 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమా 420 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని చెప్పారు. ఇలా భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ఆ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా మంచి ఆదరణ పొందుతోంది.

Mrunal Thakur: ధనుష్‌తో బ్రేకప్.. క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్?
Mrunal Thakur: ధనుష్‌తో బ్రేకప్.. క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్?

సుకుమార్ సినిమాకు సన్నాహాలు
'పెద్ది' విజయానంతరం రామ్ చరణ్ తన తదుపరి సినిమా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, షూటింగ్ పూర్తై విడుదల కావడానికి మరో రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మధ్యకాలంలో షూటింగ్‌లకు విరామం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి ఈ కొత్త ఫామ్‌హౌస్‌లో సమయం గడపాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఫామ్‌హౌస్‌కు సంబంధించిన ఖర్చు, గృహప్రవేశ తేదీ, ఇతర వివరాలపై అధికారికంగా వెల్లడి కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X