RC17: రంగస్థలం, పెద్ది కంటే మించి.. రామ్ చరణ్ కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్..

RC17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే ఓ ప్రత్యేక గుర్తింపు. వీరిద్దరి పేర్లు వింటేనే టాలీవుడ్ అభిమానుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. అందుకు ప్రధాన కారణం 'రంగస్థలం'. 2018లో విడుదలైన ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ విజయమే కాదు.. రామ్ చరణ్ నటుడిగా మరో స్థాయిలో నిలిపింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో సినీ వర్గాల్లో భారీ చర్చ మొదలైంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని అంశాలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇంతకీ మ్యాటరేంటీ?

Also Read
Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
Bigg Boss Telugu 10: నాగార్జునకు మరో జాక్‌పాట్? బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పూజా కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌కు చివరి మెరుగులు దిద్దుతున్న సుకుమార్.. ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం. అన్ని పనులు పూర్తి చేసిన వెంటనే నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్‌తో మూవీ మేకర్స్ ముందుకు వెళ్తోంది. ఈ సినిమాను తొందరపడకుండా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించాలనే ఉద్దేశంతో మేకర్స్ సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

RC17 Update Ram Charan-Sukumar Film to Be a Stylish Action Entertainer Not a Period Drama

ఈ సినిమా విడుదల విషయంలో కూడా పెద్ద ప్లానింగ్ జరుగుతోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించారు మూవీ మేకర్స్. దీంతో 2027 చివర్లో లేదా 2028 మార్చిలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకుని సినిమా రూపొందుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ సినిమా పీరియాడికల్ కథ అని, 'పుష్ప' తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కుతుందని సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ఆ రూమర్లకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌ కాదనీ, అలాగే రెండు భాగాలుగా కూడా రాదని తెలుస్తోంది. పూర్తిగా ఒకే భాగంలో తెరకెక్కే స్టైలిష్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Recommended For You
రామ్ చరణ్ మరో ఘనత.. కోహ్లీని వెనక్కి నెట్టి టాప్‌ ప్లేస్‌లో.. ప్రభాస్, ఎన్టీఆర్ ర్యాంక్ ఎంత?
రామ్ చరణ్ మరో ఘనత.. కోహ్లీని వెనక్కి నెట్టి టాప్‌ ప్లేస్‌లో.. ప్రభాస్, ఎన్టీఆర్ ర్యాంక్ ఎంత?

సుకుమార్ సినిమాల ప్రత్యేకత కథ చెప్పే విధానం. సాధారణ కథను కూడా తన స్క్రీన్‌ప్లేతో అసాధారణంగా మార్చగల దర్శకుడిగా ఆయనకు పేరుంది. 'ఆర్య, 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్ప సినిమాలతో ఈ ప్రత్యేకత స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు RC17లో కూడా అదే తరహా సర్‌ప్రైజింగ్ స్క్రీన్‌ప్లే ఉంటుందని సమాచారం. ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు, భావోద్వేగాలతో పాటు భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌కు సుకుమార్ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కూడా ఆయన కెరీర్‌లో స్ట్రాంగ్ రోల్స్ లో ఒకటిగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. నటనకు స్కోప్ ఉండేలా పాత్రను డిజైన్ చేశారని సమాచారం. ఇప్పటికే 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్రతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న చరణ్.. ఇటీవల 'పెద్ది'తో మరోసారి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు RC17లో ఈ రెండు సినిమాలను మించే స్థాయిలో పెర్ఫార్మెన్స్‌కు అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామా కూడా పాత్రలో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

You May Also Like
Lenin 9 Days Box Office: 'లెనిన్' బాక్సాఫీస్ వేట.. అఖిల్ సినిమా ఎంత కొల్లగొట్టిందంటే?
Lenin 9 Days Box Office: 'లెనిన్' బాక్సాఫీస్ వేట.. అఖిల్ సినిమా ఎంత కొల్లగొట్టిందంటే?

అలాగే.. మెగా అభిమానులు కోరుకునే భారీ యాక్షన్ బ్లాక్స్, స్టైలిష్ ఫైట్లు, విజువల్ ట్రీట్‌లా ఉండే సీక్వెన్స్‌లు ఇందులో ప్లాన్ చేశారని తెలుస్తోంది. సంగీతం విషయంలో కూడా పెద్ద సర్‌ప్రైజ్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి ఓ బాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. మొత్తంగా చూస్తే RC17 సాధారణ కమర్షియల్ సినిమా కాదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడైన తర్వాత సినిమాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read more about: ram charan sukumar rc17
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X