Lenin 10 Days Box Office: 'లెనిన్' బాక్సాఫీస్ వేట.. అఖిల్ సినిమా ఎంత కొల్లగొట్టిందంటే?
Lenin Box Office Collection: అక్కినేని అఖిల్ హీరోగా, మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లెనిన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ సినిమాకు ఫ్లస్ పాయింట్ గా మారింది. అఖిల్ కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో అత్యధిక తొలి వారం వసూళ్లు సాధించిన సినిమాగా 'లెనిన్' నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వారంలో కూడా కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లెనిన్ సినిమా తొలివారం ఏ మేరకు వసూళ్లను సాధించింది. రెండో వీకెండ్ బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఏమిటి? 10 రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? అనే వివరాల్లోకి వెళితే..
లెనిన్ సినిమాను సుమారు 55 కోట్ల రూపాయాల బడ్జెట్‌తో నిర్మించారు. నిర్మాణ వ్యయంతో పాటు సాంకేతిక నిపుణుల ఖర్చులు, ప్రచార వ్యయం కూడా భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కులు, ఇతర నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా నిర్మాతలకు గణనీయమైన ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో థియేట్రికల్ రిస్క్ చాలా వరకు తగ్గిపోయింది. ఈ సినిమాకు థియేట్రికల్‌గా సుమారు 24 కోట్ల రూపాయాల బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఉండగా, తొలి వారంలోనే ఆ మార్క్‌ను దాటేసి అన్ని ప్రధాన ఏరియాల్లో లాభాల్లోకి అడుగుపెట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఇక లెనిన్ రోజువారీ కలెక్షన్లను పరిశీలిస్తే.. అఖిల్ సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. మొదటి రోజు 7.15 కోట్ల రూపాయాల నెట్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, రెండో రోజు 8.85 కోట్ల రూపాయాలు, మూడో రోజు 9.90 కోట్ల రూపాయాలు వసూలు చేసింది. వీకెండ్ ముగిసే సమయానికి సినిమాకు స్ట్రాంగ్ పునాది ఏర్పడింది. వర్కింగ్ డేస్‌లో సాధారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వసూళ్లు తగ్గాయి. నాలుగో రోజు 3.60 కోట్ల రూపాయాలు, ఐదో రోజు 3 కోట్ల రూపాయాలు, ఆరో రోజు 2.15 కోట్ల రూపాయాలు, ఏడో రోజు 2 కోట్ల రూపాయాలు వసూలు చేసి తొలి వారం ముగిసే సమయానికి 36.65 కోట్ల రూపాయాల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది.
ఇక రెండో వారంలో కూడా సినిమా జోరు తగ్గలేదు. ఎనిమిదో రోజు 1.65 కోట్ల రూపాయాల నెట్ వసూలు చేసిన ఈ సినిమా, తొమ్మిదో రోజు 2. 40 కోట్ల రూపాయాల నెట్ రాబట్టింది. ఇది ఎనిమిదో రోజుతో పోలిస్తే 45.5 శాతం కలెక్షన్లు పెరిగాయి. రెండో శనివారం వసూళ్లు పెరగడం సినిమా ఇంకా ప్రేక్షకులను ఆకర్షిస్తోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. వీకెండ్ ప్రభావంతో ఆదివారం కూడా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇలా 9 రోజుల్లో 'లెనిన్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 46.70 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. అదే సమయంలో ఇండియన్ నెట్ కలెక్షన్లు 41.53 కోట్ల రూపాయాలకు చేరుకున్నాయి. ఓవర్సీస్‌లో కూడా సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. తొమ్మిదో రోజు విదేశాల్లో 50 లక్షల రూపాయాల గ్రాస్ వసూలు చేయడంతో మొత్తం ఓవర్సీస్ గ్రాస్ 10.20 కోట్ల రూపాయాలకు చేరుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా మొత్తం 56.90 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు భావిస్తున్నారు.
ఏరియాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సినిమా దుమ్మురేపుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు 41.10 కోట్ల రూపాయాల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 4.50 కోట్ల రూపాయాలు, తమిళనాడులో 49 లక్షల రూపాయాలు వసూలు చేసింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గ్రాస్ కలెక్షన్లు 46.70 కోట్ల రూపాయాలకు చేరుకోవడం విశేషం.
ఇక పదో రోజు కూడా 'లెనిన్' మంచి జోరుతో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 971 షోలలో సినిమా ప్రదర్శితమవుతోంది. అందుబాటులో ఉన్న ప్రారంభ ట్రాకింగ్ ప్రకారం.. పదో రోజు ఇప్పటికే 83 లక్ష రూపాయాల నెట్ కలెక్షన్లు అందుకుంది. సాయంత్రం, రాత్రి షోలకు కలెక్షన్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను గమనిస్తే.. నేటీ కలెక్షన్లు 3 కోట్ల రూపాయాల నుంచి 3.5 కోట్ల రూపాయల నెట్ రాబట్టే అవకాశముందని అంచనా. దీంతో ఇండియన్ గ్రాస్ వసూళ్లు 50 కోట్ల రూపాయాలకు, ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్‌ను అందుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు.. ఈ సినిమా 6 రోజుల్లో 78 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసిందని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.
మొత్తంగా చూస్తే 'లెనిన్' అఖిల్ అక్కినేని కెరీర్‌లో ఒక కీలక మలుపుగా నిలిచింది. కమర్షియల్‌గా మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ పరంగా కూడా ఆయనకు అత్యంత పెద్ద విజయాన్ని అందించింది. బ్రేక్ ఈవెన్‌ను సులభంగా దాటేసిన ఈ చిత్రం ఇప్పుడు లాభాలను మరింత పెంచుకుంటూ విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా ఫుల్ రన్‌లో ఇంకా ఎన్ని కొత్త రికార్డులు నమోదు చేస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


Click it and Unblock the Notifications





