RC 17: రామ్ చరణ్ మూవీలో స్టార్ హీరోయిన్.. సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా?
RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట వీరిద్దరి కలయికలో మొదటగా వచ్చిన 'రంగస్థలం' భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఇటు రామ్ చరణ్ కెరీర్ లో.. అటు సుకుమార్ కెరీర్ లో మైల్స్ స్టోన్ గా నిలిచింది. ఇలాంటి హిట్ ఫెయిర్ మరోసారి రిపీట్ అవుతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో RC17పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ జోడి ఎవరు? అనేది చర్చనీయంగా మారింది. ఇప్పటివరకు ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు?
రామ్ చరణ్ జోడిగా మొదట కియారా అద్వానీ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే.. ఇప్పుడు తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు బలంగా వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుకుమార్ కెరీర్‌ను పరిశీలిస్తే.. ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఆయన సాధారణంగా ఒక హీరోయిన్‌తో వరుసగా రెండు సినిమాలు చేయరు. 'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకు దాదాపు ప్రతి సినిమాలో కొత్త హీరోయిన్‌కే అవకాశం ఇచ్చారు. అదే ఆయన సెంటిమెంట్‌గా కూడా మారింది.

అయితే ఈసారి ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 'పుష్ప' సిరీస్‌లో రష్మిక నటనతో సంతృప్తి చెందిన సుకుమార్.. మరోసారి ఆమెనే ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రష్మికకు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. 'పుష్ప' తర్వాత ఆమె మార్కెట్ మరింత పెరిగింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందుకే ఆమె ఉంటే సినిమాకు అన్ని భాషల్లో మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. రామ్ చరణ్, రష్మిక ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే.. ఈ ఫ్రెష్ పెయిర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వొచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. RC17లో హీరోయిన్ పాత్రకు కథలో మంచి ప్రాధాన్యం ఉంటుందట. కేవలం పాటలు, గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను ముందుకు నడిపించే పాత్రగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందుకే బెస్ట్ హీరోయిన్ కోసం సుకుమార్ వెతుకుతున్నట్లు తెలుస్తోంది. 'రంగస్థలం' తరహాలో మరో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఇవన్నీ ప్రచారంలో ఉన్న వార్తలే. చిత్రబృందం ఇప్పటివరకు హీరోయిన్ ఎంపికపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో RC17లో హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications



